Amala Paul: అమలా పాల్ ఈ మధ్య వెబ్ సిరీస్ లతో మళ్ళీ ఫామ్ లోకి రావడానికి తెగ రెచ్చిపోతుంది. తన కిర్రాక్ అందాలతో మతి పోగొడుతుంది. తన మత్తు కళ్ళతో వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ఐతే, ప్రస్తుతం వరుస వెబ్ ఫిల్మ్స్ తో దూసుకుపోతోన్న ఈ బ్లాక్ బ్యూటీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ అమలా పాల్ ఏ విషయం గురించి మాట్లాడిందో తెలుసా ?, టాలీవుడ్ లో హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కు మాత్రమే పనికొస్తారు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంకా అమలా పాల్ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం. ‘నాకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ, స్టార్ హీరోయిన్ కాలేకపోయాను. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అసలు నిజం చెప్పాలంటే.. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ను కేవలం లవ్ సీన్స్, సాంగ్స్ కోసమే సినిమాల్లోకి తీసుకుంటారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ కథకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. కేవలం తెలుగు మేకర్స్ గ్లామర్ కోణంలోనే హీరోయిన్లను చూస్తారు.
ఇక్కడ ఉన్న ఈ డిఫరెంట్ కల్చర్ కారణంగా నేను పెద్దగా తెలుగు సినిమాలకు కనెక్ట్ కాలేకపోయాను. పైగా టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల చేతిలోనే ఉంది. వారి ప్రభావం సినిమాలపై బాగా ఉంటుంది’ అంటూ అమలా పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అమలా పపాల్ల్ ఎందుకు ఇలా మాట్లాడింది ? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అసలు అమలా పాల్ మోడల్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె అలాగే బోల్డ్ గా ఉంటూ వస్తోంది. స్టార్టింగ్ లో స్లోగా స్టార్ డమ్ ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ.. మధ్యలో అనుకోకుండా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు చాలా గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఇలా అడ్డు అదుపు లేకుండా బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అయితే, అమలా పాల్ కు చిన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి.

ఇక అమలా పాల్ లోని గ్లామర్ గురించి కొత్తగా చెప్పుకునేది ఏమి ఉంది. ప్రస్తుతం ఉన్న చాలామంది గ్లామర్ డాల్స్ కంటే కూడా, ఆమె చాలా మంచి నటి. అలాగే అందాల నిధి కూడా. అందుకే అమలా పాల్ కి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. కానీ ఎందుకో అమలా పాల్ కి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావట్లేదు. వస్తోన్న ఆఫర్లు కిక్ ఇవ్వడం లేదు.