Hair On Tongue: ఇదేం కాలమో ఏమో గానీ రోజుకో కొత్త రోగం తెరమీదకు వస్తోంది. ఇప్పుడు కేరళలో ఓ వ్యక్తికి వచ్చిన జబ్బు గురించి తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీకు నాలుక మీద ఉండే మచ్చల గురించి తెలిసే ఉంటుంది. అయితే నాలుక మొత్తం బ్లాక్ గా మారిపోయి, వెంట్రుకలు పెరగడం గురించి మీరెప్పుడైనా విన్నారా.. ఏంటీ అదేం రోగం అని షాక్ అవుతున్నారా అయితే మీకు ఈ విషయం గురించి పూర్తిగా చెబుతాం వినండి.

జమా డెర్మటాలజీలో చెప్పిన విషయాల ప్రకారం కేరళలోని కొచ్చిన్ లో నివసిస్తున్న ఓ 50 ఏండ్ల వ్యక్తికి ఇప్పుడు ఓ వింత జబ్బు వచ్చింది. ఆయన నాలుక సడెన్ గా నల్లగా మారిపోయి వెంట్రుకలు పెరగడంతో ఆందోళన చెంది మెడికల్ ట్రస్ట్ హాస్పిటల్ కు వెళ్లాడు. అతన్ని పూర్తి స్థాయిలో టెస్టులు చేసిన డాక్టర్లు అతనికి లింగువా విల్లోసా నిగ్రా (బ్లాక్ హెయిర్ టంగ్-BHT) వ్యాధి సోకినట్టు తేల్చారు.
Also Read: అసెంబ్లీలో స్పీకర్ పై భగ్గుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి
కాగా అతనికి చిన్నప్పటి నుంచి ఈ వ్యాధి లేదని, మూడు నెలల కింద అతను పక్షవాతం బారిన పడటంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో అతను బాధపడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అతని శరీరంలో ఎడమవైపు ఉన్న అవయవాలు పాడైపోయిన తర్వాత రెండు నెలలకు నాలుక ఇలా మారిపోయిందని చెప్పారు డాక్టర్లు.
కాగా అతని నాలుక మీద ఉన్న కోన్ ఆకారపు గడ్డలు ఉన్నాయని, అవి మొత్తం వెంటుకలను పోలినట్టు ఉంటున్నాయని వివరించారు. బాధితుడు పక్షవాతం కారణంగా తన నోటిని కదపలేకపోయాడు. దీంతో కుటుంబీకులు అతనికి ద్రవ పదార్థ రూపంలో ఉన్న ఆహారాన్ని మాత్రమే ఇస్తున్నారు. ఈ కారణంగా క్రమేనా ఆ ద్రవ పదార్థాలు మొత్తం నాలుక మీద పేరుకుపోయి చివరకు BHT వ్యాధి సోకడానికి దారి తీశాయంటున్నారు డాక్టర్లు.

అయితే నాలుక పొడిబారే సమస్య ఉన్న వారిలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని, జుట్టు పెరుగుతుందని చెప్పారు డాక్టర్లు. కాగా ఈ వ్యాధి నోటిని క్లీన్ గా ఉంచకోకపోవడం వల్ల, అలాగే నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, అలాగే కాఫీ, టీ లాంటివి ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు.
Also Read: అసంతృప్తుల రహస్య భేటీలు.. ఆ పార్టీలోకి జంప్ అవుతారా.. కేసీఆర్ బుజ్జగిస్తారా..?