Guntur Triangle Love Story: ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా కథ గురించి మనకు తెలిసిందే. ఒక మహిళను ఇద్దరు ప్రేమించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇదే కోవలో జరిగిన ఓ కథ ఆసక్తికరంగా మారింది. ఒక మహిళను ఇద్దరు పురుషులు ప్రేమించడం ట్రయింగిల్ లవ్ స్టోరీని తలపించే యథార్థ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. దీంతో అందులో ఒకడిని అంతమొందించడంతో విషయం కాస్త అందరికి తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన దీనిపై అందరికి ఆసక్తి పెరుగుతోంది. విజయ్, ఉష ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోకున్నా సహజీవనం చేస్తున్నారు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. కొన్నాళ్లు సజావుగా సాగిన వారి మధ్య మరో వ్యక్తి రంగ ప్రవేశం చేశారు. ఉషను ప్రేమిస్తున్నానంటూ అప్పాజీ అనే వ్యక్తి కూడా వెంట పడ్డాడు. దీంతో అతడికి కూడా తన ప్రేమను పంచాలని భావించింది.
ఇదే విషయాన్ని విజయ్ కు చెప్పింది. ముగ్గురం కలిసి ఉందామని సూచించింది. దీనికి విజయ్ కూడా ఓకే చెప్పడంతో ముగ్గురు కలిసి ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కి ఉష తనతో సఖ్యతగా ఉండటం లేదని అనుమానం వచ్చింది. అప్పాజీతో చనువుగా ఉంటుందని గ్రహించాడు. దీంతో అప్పాజీని అంతమొందించాలని పక్కా పథకం రచించాడు.
అప్పాజీ గాఢ నిద్రలో ఉండగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు విజయ్. అడ్డు వచ్చిన ఉషను కూడా గాయపరిచాడు. దీంతో ట్రయాంగిల్ స్టోరీ కాస్త క్రైమ్ స్టోరీగా మారింది. మొదట ఆమోదించడమెందుకు తరువాత మట్టు పెట్టడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ కోసం నిండు ప్రాణాన్ని తీయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉషను సైతం నిందిస్తున్నారు. అనవసరంగా ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారకులైన వారిని దూషిస్తున్నారు.