Kurchi Song Spoof: సోషల్ మీడియా ఇటీవల హద్దులు దాటుతోంది. ప్రత్యర్థులపై రకరకాల అస్త్రాలను సంధిస్తోంది. లేనిపోని ప్రచారానికి దిగుతోంది. తాజాగా వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబుతో పాటు లోకేష్ పై ఓ స్థాయిలో విరుచుకుపడింది. గుంటూరు కారం సినిమాలో సైకిల్ కి మడతేసి స్పూఫ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ సోషల్ మీడియా విభాగం దీనిని ట్రోల్ చేయడం విశేషం.
స్లో మోషన్ సైకిల్, బ్రేక్ సైకిల్, బ్రేకింగ్ సైకిల్.. క్లిప్పింగులు పెడుతూ సాగిన ఈ సాంగ్ భలే ఆసక్తిగా ఉంది. ఎడిటింగ్ ఫోటోలు, వీడియోలతో ఈ స్పూఫ్ సాంగ్ ను చాలా బాగా తీర్చిదిద్దారు. మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో మడతపెట్టి సాంగ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే పాటను వైసిపి సోషల్ మీడియా టిడిపి పై ప్రయోగిస్తూ ప్రచారం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రత్యర్థులను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు సోషల్ మీడియా వింగ్ లు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి సెలబ్రిటీలు సైతం హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వివిధ రంగాల ప్రముఖులను సైతం సోషల్ మీడియా విభాగాలు ఆకర్షిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి వంటి వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేందుకుగాను భారీ ప్యాకేజీ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవైపు సెలబ్రిటీలతో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయించడంతో పాటు స్పూఫ్ సాంగ్స్ తో ఇలా ఎడిటింగ్ వీడియోలు సైతం దర్శనం ఇవ్వడం ఇటీవల పరిపాటిగా మారింది.
ఎడిటింగ్ వేరే లెవెల్
మడతపెట్టి …..— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) January 8, 2024