Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీ రిలీజ్ కి సర్వం సిద్దం… ఎప్పుడు ఎక్కడ అంటే..?

మహేష్ బాబు పక్కాగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అంటూ ఆయన ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్ కాస్టింగ్ తో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

Written By: Gopi, Updated On : January 9, 2024 11:43 am

Guntur Kaaram Collections

Follow us on

Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాలకు ముందే అనౌన్స్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా లేటవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని పూర్తిచేసుకొని ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించడానికైతే మన ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా మీద ఇప్పటివరకు అంచనాలు ఒకలా ఉంటే రెండు రోజుల క్రితం వచ్చిన ట్రైలర్ ని చూసిన తర్వాత అభిమానులు అంచనాలైతే ఒక్కసారి గా తారస్థాయికి చేరిపోయాయి.

ఇక ఈ సినిమాతో మహేష్ బాబు పక్కాగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టబోతున్నాడు అంటూ ఆయన ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్లు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు లాంటి స్టార్ కాస్టింగ్ తో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. త్రివిక్రమ్ సినిమా అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సినిమా కూడా అలానే ఉండబోతుందంటూ ఈ ట్రైలర్ ని చూస్తే మనకు అర్థమవుతుంది…ఇక ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా మీద ఇంకా అంచనాలు పెంచడానికి సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది అంటూ రూమర్ లైతే వచ్చాయి.

కానీ ఇప్పుడు ఏది ఏమైనా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపాలని సినిమా యూనిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే గుంటూరు సమీపంలోని నంబూరు క్రాస్ రోడ్స్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ లో రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఫంక్షన్ లో ఈ ఈవెంట్ ని జరపనున్నట్టుగా తెలుస్తుంది….ఇక అందులో భాగంగా మహేష్ అభిమానులు ఎంతమంది వచ్చినా కూడా దానికి సరిపడే విధంగా ఆ గ్రౌండ్ ని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఉండబోతున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి…ఇక ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ భావిస్తుంది. అలాగే సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ లో సినిమా యూనిట్ ఉన్నట్టు గా తెలుస్తుంది…