https://oktelugu.com/

Devara Glimpse: దేవర గ్లింప్స్ తో ఆ రూమర్స్ కి చెక్… ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నమ్మకం కుదిరినట్లేనా?

దేవర గ్లింప్స్ నిర్మాతలపై ఉన్న అనుమానాలు పటాపంచలు చేసింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అయితే కళ్యాణ్ రామ్ కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి.

Written By: , Updated On : January 9, 2024 / 10:13 AM IST
Devara Glimpse

Devara Glimpse

Follow us on

Devara Glimpse: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూసిన అప్డేట్ వచ్చేసింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దేవర ఫస్ట్ గ్లింప్స్ ఉంది. నిమిషానికి పైగా సాగిన దేవర ప్రోమో అలరించింది. ఎన్టీఆర్ రౌడీలను ఊచకోత కోశాడు. శత్రువుల రక్తంతో సాగరతీరం ఎరుపెక్కింది. సముద్రం చేపల కంటే కత్తులు, నెత్తురునే ఎక్కువ చూసింది. అందుకే ఎర్ర సముద్రం అంటారు… అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ రేపింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. విజువల్స్ క్వాలిటీ పీక్స్ లో ఉంది.

కాగా దేవర గ్లింప్స్ నిర్మాతలపై ఉన్న అనుమానాలు పటాపంచలు చేసింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. అయితే కళ్యాణ్ రామ్ కి చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయి. దేవర వంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డీల్ చేసే సత్తా ఎన్టీఆర్ ఆర్ట్స్ కి ఉందా? సరిపడా బడ్జెట్ సమకూర్చగలరా? అవుట్ ఫుట్ ఎలా ఉండబోతోందనే? సందేహాలు ఉన్నాయి.

గతంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ తెరకెక్కించిన జై లవకుశ, బింబిసార చిత్రాల నిర్మాణ విలువలు ఆశించిన స్థాయిలో లేవనేది వారి వాదన. దేవర అంచనాలకు తగ్గట్లు తెరకెక్కించగలరా అనే సందేహాలు ఉండగా… ఫస్ట్ గ్లింప్స్ విమర్శలకు చెక్ పెట్టింది. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు. అలాగే దేవర నిర్మాణ విలువలు, విజువల్స్ రిచ్ గా ఉంటాయని ఫస్ట్ గ్లింప్స్ హింట్ ఇచ్చేసింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.

దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. పార్ట్ 1 ఈ ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. కొరటాల శివ దర్శకుడు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. దేవర మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.