
Gujarat Vs Chennai: కొత్త చరిత్ర మొదలు కాలేదు. పాత సీనే రిపీట్ అయింది. ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్లో గుజరాత్ బోణి చేసింది.. చెన్నై జట్టుపై జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత రాధి జరిగిన ఐపీఎల్ లోనూ రెండు మ్యాచ్ల్లో చెన్నై పై గుజరాత్ విజయం సాధించింది. అయితే ఈసారి ధోని హార్దిక్ పాండ్యా పై చేయి సాధిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అలా ఏం జరగలేదు.
వాస్తవానికి ఈ మైదానంపై తేమ ఎక్కువ ఉన్నది. ఇలాంటప్పుడు చేజింగ్ జట్టుకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.. అలాంటప్పుడు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు తక్కువలో తక్కువ 190 వరకు పరుగులు చేయాల్సి ఉంటుంది.. కానీ చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 178 పరుగులు చేసింది. రుతు రాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్ లతో 92) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కెప్టెన్ ధోని (14) మెరుపులు మెరిపించాడు. చెన్నై బ్యాట్స్ మేన్ లలో గైక్వాడ్ తప్ప మిగతా వారెవరూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. దీనివల్ల అతడిపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆయనప్పటికీ అంత ఒత్తిడిలోనూ గైక్వాడ్ ఆడిన షాట్లు చూస్తే ముచ్చటేసింది.
మైదానం మీద తేమ ఉన్న నేపథ్యంలో చేజింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు..గిల్(36 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్ లతో 63) హాఫ్ చేశాడు.. గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. వృద్ధిమాన్ సాహ (16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు25), సాయి సుదర్శన్ (17 బంతుల్లో మూడు ఫోర్లతో 22), విజయ శంకర్ (21 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్ తో 27) రాణించడంతో గుజరాత్ విజయం సాధించింది. అయితే ఇలాంటి అప్పుడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన చెన్నై జట్టు తేలిపోయింది. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు 20 పరుగులు తక్కువగా చేయటం…

మరీ ముఖ్యంగా 19 ఓవర్లో దీపక్ చాహార్ 15 పరుగులు ఇవ్వడం చెన్నై విజయవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. 17 ఓవర్లో దీపక్ చాహర్ 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 18 ఓవర్లో హంగేర్కర్ బౌలింగ్లో తేవాటియా భారీ సిక్సర్ బాదాడు.. అయితే ఈ ఓవర్ లో విజయ్ శంకర్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. ఇక బౌలింగ్ మెరుగ్గా చేస్తున్నాడు అని నమ్మి ధోని చాహర్ కు మళ్ళీ 19 ఓవర్ బాధ్యత అప్పగించాడు. రషీద్ ఖాన్ వరుసగా 6,4 బాదాడు. ఈ ఓవర్ లో ఏకంగా 15 పరుగులు సాధించాడు. దీంతో చివరి ఓవర్లో గుజరాత్ జట్టుకు 8 పరుగులు అవసరం అయ్యాయి. దేశ్ పాండే వేసిన ఆఖరి ఓవర్లో తేవాటియా సిక్స్, ఫోర్ కొట్టి లాంచనాన్ని పూర్తి చేశాడు.. ఒకవేళ చాహార్ మెరుగ్గా బౌలింగ్ చేసి ఉంటే చెన్నై జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది. 19 వ ఓవర్ లో దీపక్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో.. మరుసటి ఓవర్ వేసిన తుషార్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో అతడు లయ తప్పాడు. ఫలితంగా తేవాటియా విజృంభించాడు. ఇక చెన్నై ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. చివరి ఓవర్లో చెత్త బౌలింగ్ వేసిన దీపక్ పైనే అన్ని వేళ్ళూ చూపిస్తున్నాయి.