Gujarat Dogs: కాస్త అటూ ఇటూగా జీవితం ఉంటే ‘నీది కుక్కు బతుకు’ అని కొందరు హేళ చేస్తారు. అంటే రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఆహారం పారేస్తే తప్ప తిండి దొరకని స్థితి వీధి కుక్కలది. అయితే కొందరు వీధి కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. టైంటూటైం వాటికి ఆహారం అందిస్తున్నారు. వాటికి అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ వచ్చి వైద్యం చేస్తున్నాడు. ఇలా అన్ని రకాల రాజభోగాలను ఆ వీధికుక్కలు అనుభవిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కుక్కులు కోటీశ్వరులుగా మారిపోయాయి. వీటి పేరిట రూ.90 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. మరి అవి ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టాయి? అసలేంటి కథ? తెలుసుకోండి..
గుజరాత్ లోని కొందరు వీధి కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలోని పంచోత్ అనే గ్రామానికి చెందిన వారు ఒక వింత ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. జంతువులను నమ్మితే తాము అనుకున్నవన్నీ జరుగుతాయని భావిస్తున్నారు. దీంతో జంతువులను దేవుళ్లుగా భావించి వాటికి కావాల్సిన సేవ చేయాలని అనుకున్నారు. అయితే తమకు అందుబాటులో ఉన్న వీధికుక్కలకు వారు సేవ చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో వీధి కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకోవాలని ప్రత్యేకంగా ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. దీనికి విరాళాలు సేకరించారు. కొందరు విరాళాలను పెద్ద మొత్తంలో అందించారు. మరికొందరు విలువైన ఆస్తులను ట్రస్టుకు ధారాధత్తం చేశారు. ఇక ఈ ట్రస్టుకు వచ్చిన ఆదాయంలో కుక్కలను ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రత్యేకంగా ఓ వంట మనిషిని ఏర్పాటు చేసి ఆహారాన్ని తయారు చేస్తున్నారు. కొందరు వలంటీర్లను నియమించి వారి ద్వారా కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నారు.
ప్రతి రోజూ 1000 రోట్టెలు తయారు చేసిన వీధిలో ఉన్న కుక్కలన్నింటికీ అందజేస్తున్నారు. అలాగే వీటికి అనారోగ్యం కలిగితే వెంటనే పశువైద్యులు అక్కడికి వస్తాడు. సంబంధిత చికిత్స చేస్తాడు. ఇలా రాజభోగాలను అనుభవిస్తున్న ఆ కుక్కలను చూసి పెంపుడు కుక్కలు అసూయపడుతున్నాయి. ప్రస్తుతం కుక్కల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు రూ.90 కోట్ల ఆస్తులు కలిగి ఉంది. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.