Bullet Bandi Song Fame Bridegroom: సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో చెప్పడం కష్టం. ఏడాది క్రితం పెళ్లి బరాత్ లో ” బుల్లెట్టు బండి” పాటకు డ్యాన్స్ చేసి నెట్టింట ఫేమస్ అయిన వధూవరులు తెలుసు కదా! యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్ దక్కాయి. రాత్రికి రాత్రే వాళ్లు సెలబ్రిటీలు అయిపోయారు. న్యూస్ ఛానళ్ళు, ఇతర యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళిద్దర్నీ ఇంటర్వ్యూలు చేశాయి. ఈ వధూ వరుల డాన్స్ పుణ్యమా అని ఆ పాట కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఆ వధువు పక్కన డాన్స్ వేసిన వరుడు అశోక్ తాజాగా ఏసీబీ వలలో చిక్కి వార్తల్లోకి ఎక్కాడు. అతడు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ లో అశోక్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. ఆ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి గృహ నిర్మాణ అనుమతుల కోసం 30,000 లంచం తీసుకుంటుండగా అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సరూర్నగర్ లోని జేబీ కాలనీకి చెందిన దేవేందర్ రెడ్డి కి బడంగ్ పేటలో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో ఇంటి నిర్మాణం కోసం టి ఎస్ బి పాస్ లో దరఖాస్తు చేసుకున్నాడు.

ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి చేశాడు. అయితే ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి మునిసిపల్ అనుమతులు కావాలంటే రెండింటికీ కలిపి 60,000 ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశోక్ డిమాండ్ చేశాడు. చివరికి ఇద్దరి మధ్య 50 వేలకు ఒప్పందం కుదిరింది. అశోక్ సూచనల మేరకు తొలి విడతగా దేవేందర్ రెడ్డి ప్రైవేట్ ప్లానర్ శ్రీనివాసరాజుకు 20,000 ఇచ్చాడు. మిగతా డబ్బుల కోసం అశోక్ ఒత్తిడి తేగా దేవేందర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. వారు చెప్పిన పథకం ప్రకారం మంగళవారం 30,000 తీసుకొని మున్సిపల్ కార్యాలయానికి దేవేందర్ రెడ్డి వెళ్ళాడు. అయితే ఈ సమాచారాన్ని అశోక్ కు చేరవేయగా శ్రీనివాస రాజుకు ఇవ్వాలని అశోక్ చెప్పాడు. దేవేందర్ రెడ్డి డబ్బులు శ్రీనివాసరాజుకి ఇవ్వగానే అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ కు వ చ్చి అశోక్ ని అదుపులోకి తీసుకున్నారు. అతని విచారించారు. లంచం కోసం డిమాండ్ చేసింది నిజమేనని అతడు ఒప్పుకున్నాడు. అశోక్ తో పాటు శ్రీనివాసరాజును అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలిస్తామని అధికారులు వెల్లడించారు.
ఆది నుంచీ వివాదాస్పదుడు
పెళ్లి బరాత్ లో డ్యాన్స్ చేసిన అశోక్ కు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అశోక్ కు చాలా తేడా. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు ఎక్కువగా జరుగుతుంటాయి. హైదరాబాద్ మహానగర సంస్థ పరిధిలో బడంగ్ పేట నిర్మాణంలో మూడో స్థానంలో ఉంటుంది. పైగా ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్లు ఇక్కడ ఎక్కువగా భూములు కొనుగోలు చేసి ఇళ్ళ నిర్మాణాలు చేస్తుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలు నిర్వహించాలని టిఎస్ బీపాస్ లాంటి వాటిని తెచ్చినా ఉపయోగం ఉండటం లేదు. లంచాలకు మరిగిన అధికారులు గృహ నిర్మాణదారులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.

పైగా అశోక్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా ఉండడంతో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేవలం డబ్బుల వసూళ్లకే ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నాడని సమాచారం. శ్రీనివాసరాజు కూడా ప్రైవేట్ ప్లానర్ అయినప్పటికీ కేవలం అశోక్ వసూళ్ల కోసమే పనిచేస్తుంటాడని బడంగ్ పేట మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. గత ఏడాది బుల్లెట్ బండి సాంగ్ ద్వారా పాపులర్ అయిన అశోక్.. ఇప్పుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కడంతో తల ఎత్తుకోలేని పరిస్థితికి దిగజారి పోయాడు. కాగా ప్రస్తుతం అతడి సతీమణి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పుట్టింటికి వెళ్లినట్టు సమాచారం.
[…] Also Read: Bullet Bandi Song Fame Bridegroom: బుల్లెట్టు బండి సాంగ్త… […]