Chiranjeevi- 2024 Elections: మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ కూడా మెగా లెవల్‌లో ఉండబోతోందా అంటే అవనుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకకులు. ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నానుంచి దూరం కాలేదు’ అనే ఒక్క డైలాగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను షేక్ చేశారు చిరంజీవి. ‘మెగా’ డైలాగ్‌లో ఆంతర్యాన్ని ఆన్వేశించే పనిలో ప్రస్తుత పార్టీలు ఉండగా, చిరంజీవి మాత్రం.. రి ఎంట్రీ తర్వాత మామూలుగా ఉండదన్న భావన వ్యక్తమవుతోంది. గత అనుభవాల దృష్ట్యా ఇసారి వేసే అడుగు సెన్షేన్ కావాలన్న ఆలోచనలో మెగా బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

జాతీయ రాజకీయాలపై దృష్టి..
తమ్ముడి పార్టీ జనసేనతోనే పొలిటికల్ రీఎంట్రీ ఉండాలని మెగాస్టార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్టీల్లో చేరితో మామూలు నేతగానే మిగిలిపోవాల్సి వస్తుంది. అదే జనసేనతో పునరాగమనం చేయడం ద్వారా ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన ఏపీలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఈ నేపథ్యంలో రీ ఎట్రీకి ఇదే అనువైన సమయం అని బాస్ భావిస్తున్నట్లు సమాచారం.
గత అనుభవాల నేపథ్యంలో..
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 290 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. తెలంగాణలో ఒక స్థానం, ఆంధ్రప్రదేశ్‌లో 17 స్థానాల్లో విజయం సాధించారు. ప్రతికూల పరిస్థితిలో పార్టీ పెట్టి, 18 ఎమ్మెల్యే స్థానాలు గెలువడంతోపాటు 70 లక్షలకుపైగా ఓట్లు సాధించారు. చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయినా.. పొలిటికల్ ఎంట్రీ సినిమా మాత్రం ఫెయిల్ కాలేదు. అయితే తర్వాత క్రమంలో వివిధ కారణాలతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీనిని నాడు పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న నేటి జనసేనాని పవన్‌కళ్యాణ్ వ్యతిరేకించారు. విలీన ప్రక్రయ ఆయనకు ఇష్టం లేకపోయినా అన్నయ్య మాట కాదనలేక మిన్నకుండిపోయారు.

జనసేనాని రాజకీయాలతో స్పూర్తి..
జనసేనాని, తన తమ్ముడు చేస్తున్న యాక్టీవ్ పాలిటిక్స్‌తో మెగాస్టార్ స్ఫూర్తి పొంది ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక కష్టమైనా, నష్టమైనా నిలబడాలి, తలపడాలి అన్నదే పవన్‌కళ్యాణ్ స్వభావం. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ కూడా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ వేరే ఉండాలన్న భవనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచే రీఎంట్రీ ఇవ్వడంతోపాటు ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తిరుపతి లేదా అమరావతి, లేదా నర్సారావుపేట నుంచి లోక్‌సభ బరిలో ఉండాలని కూడా చిరంజీవి నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో తమ్ముడు పవన్‌కళ్యాణ్, జాతీయ రాజకీయాల్లో తాను కీలకంగా వ్యవహరించాలన్న ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.