
Great Emu War: మనం చాలా యుద్ధాల గురించి విన్నాం.. చదివాం.. చూస్తున్నాం కూడా. స్వాతంత్య్రం కోసం, స్వాభిమానం కోసం, రాజ్యం కోసం.. ఆధిపత్యం కోసం.. ఆక్రమణ కోసం ఇలా అనేక యుద్ధాలు చరిత్ర పుటలలో లిఖించబడ్డాయి. అయితే పక్షులు, పక్షులుసైనికుల మధ్య జరిగిన యుద్దం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఇప్పుడు మీకు అలాంటి విచిత్ర యుద్ధం గురించి తెలుసుకోబోతున్నాం.
Also Read: Janhvi Kapoor- NTR: అమ్మతో ఆ ఎన్టీఆర్… ఆమె కూతురితో ఈ ఎన్టీఆర్, కాంబో అదుర్స్ కదూ!
ఆర్థిక మాద్యంతో సాగు భూములు..
పక్షులు, సైనికుల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకోవాలంటే.. 1915లో ఆస్ట్రేలియాలో జరిగిన పరిణామాలు తెలియాలి. 1915లో ఆస్ట్రేలియా తీవ్ర ఆర్థికమాంద్యం ఎదుర్కొంది. దీంతో మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్న అనుభవజ్ఞులైన సైనికులకు పెన్షన్ చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో లాభదాయకమైన ఉపాధిని పొందడంలో సహాయపడటానికి 5 వేల మంది సైనికులకు గోధుమలు పండించడం, గొర్రెల పెంపకం కోసం పశ్చిమ ఆస్ట్రేలియాలో సాగు భూములను అందించింది. దీనిని ఈము దేశం అని కూడా పిలుస్తారు. రిటైర్డ్ సైనికులు అక్కడే స్థిరపడి రైతులుగా మారారు. ప్రభుత్వం నుంచి పొందిన భూములను సాగు చేయడం ప్రారంభించారు.
ఈము పక్షుల రూపంలో ముప్పు..
అయితే సరిగ్గా ఏడేళ్ల తర్వాత అంటే 1922లో రైతులుగా మారిన సైనికులకు పక్షి ఈము రూపంలో పెద్ద సమస్య ఎదురైంది. ఈము పక్షులు మూకుమ్మడిగా పంటలను తొక్కడం, నాశనం చేయడం ప్రారంభించాయి. ఈ కారణంగా, రైతులుగా మారిన సైనికులు భారీ నష్టాలను చవిచూశారు. వాటి బారి నుంచి పంటలను కాపాడుకోవడానికి, పొలాల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ అడవి పక్షి సమూహం ఆ ఫెన్సింగ్‌లను కూడా ధ్వంసం చేశాయి. ముప్పును తట్టుకోలేక ప్రభుత్వం త్వరగా వారిని ‘రక్షిత జాతులు‘ నుండి ‘పురుగులు‘గా తిరిగి వర్గీకరించింది. 1932 నాటికి 20 వేలకంటే ఎక్కువ ఈములు వ్యవసాయ క్షేత్రాలపై దాడిచేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
దుర్భరంగా రైతుల పరిస్థితి..
అదే సమయంలో మహా మాంద్యంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయాయి. ఒకవైపు ఈములతో నష్టం, మరోవైపు ధరల పథనంలో రైతుల జీవితాలను మరింత కష్టతరం చేసింది. ఈములను ఎదుర్కోలేక రైతులు భూములను వదిలివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈములను ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. 1932, నవంబర్ 2న రైతు సంఘాలు, ఇతర కార్యకర్తల నుంచి విపరీతమైన ఒత్తిడి తర్వాత ఆస్ట్రేలియా సైన్యం రంగంలోకి దిగింది.
1932లో ఈములతో యుద్ధం..
ఈముల వేట కోసం రంగంలోకి దిగిన సైన్యం సైనికులు 10 వేల రౌండ్ల మందుగుండు సామగ్రి, లూయిస్ మెషిన్ గన్‌లతో పెర్త్ నుంచి బహిరంగ దాడికి బయలుదేరారు. అది విఫలమైంది. 1932, నవంబర్ 4న ఒక భారీ ఈముల సమూహాన్ని గుర్తించారు. వాటిపై కాల్పులు జరిపారు. తర్వాత కాల్పుల్లో చనిపోయిన ఈము పక్షులను లెక్కగడితే కేవలం 12గా తేలాయి. మిగతావి పారిపోయాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియన్ మీడియా వినాశకరమైన వైఫల్యాన్ని విస్తృతంగా కవర్ చేసింది. ఈ క్రమంలో సైనికుల నుంచి తమకు ముప్పు ఉందని గుర్తించిన ఈము పక్షులు తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యేక పద్ధతులను అనుసరించాయి. ఇదే సమయంలో వార్తాపత్రికల నిపుణులు ఈము పక్షులపై యుద్ధ వ్యూహాలను నిరంతరం ముద్రించాయి. ఒక్కో ఈమును చంపడానికి కనీసం రెండు బుల్లెట్లు అవసరం పడతాయని, అయినా ఈములన్నీ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాయని కూడా వెల్లడించాయి.

ఈమూల సరికొత్త వ్యూహం..
సైనికుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఈములు తమను చిన్న సమూహాలుగా విభజించుకున్నాయి. రైతుల పంటలను నాశనం చేయడం.. సైనికులు దాడి చేయడానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోతూ తెలివితేటలు ప్రదర్శించాయి. దీంతో ఆస్ట్రేలియా సైన్యం ఈములను ఎదుర్కోవడానికి గెరిల్లా యుద్ధానికి కూడా సిద్ధమైంది. వాటికి దగ్గరగా వచ్చి అన్ని దిశల నుంచి పక్షులను కాల్చివేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. మిలటరీ ప్రతీ వ్యూహాన్ని ఈము పక్షులు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఈములు తెలివిగా వ్యవహరిస్తున్నాయని సైన్యం కూడా అంగీకరించింది. సమూహాలుగా విడిపోయిన ఈముల గుంపునకు ఒక పెద్ద ఈము నాయకుడిగా ఉంటూ పంటలను ధ్వంసం చేసే సమయంలో, సైన్యం దాడిచేసే సమయంలో సమూహానికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు మేజర్ మెరెడిత్ ఆస్ట్రేలియన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 38 రోజుల తీవ్ర యుద్ధం తర్వాత తుపాకులు ధ్వంసం కావడం, వాహనాలు విరిగిపోవడం, కొన్ని వందల ఈములను మాత్రమే చంపడంతో 19332, డిసెంబర్ 10న గ్రేట్ ఈము యుద్ధాన్ని విరమించుకోవాలని సైన్యం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో విధిలేని పరిస్థితిలో యుద్ధాన్ని విరమించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం నేరుగా రైతులకే మందుగుండు సామగ్రి అందించాలని నిర్ణయించింది. 200 కిలోమీటర్ల పొడవైన యాంటీ ఈము వాల్ నిర్మిస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ, అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఈ సంఘటనను ఆస్ట్రేలియా చరిత్రలో ‘ఈము వార్’ లేదా ‘గ్రేట్ ఈము వార్’ అని పిలుస్తారు. ఈ ఆపరేషన్ ఇన్‌చార్జి మేజర్ ముర్దిత్ మాట్లాడుతూ ఈము పక్షుల లాంటి స్ట్రాటజీ అమలు చేస్తే.. ప్రపంచంలోని ఏ సైన్యాన్ని అయినా తాము ఎదుర్కోగలమని చెప్పుకొచ్చాడు.
Also Read:Kodali Nani Drives RTC Bus: జగన్ క్లాస్ బాగా పనిచేసింది.. కొడాలి నానిని బస్సెక్కించింది