
Conspiracy against BJP leader Annamalai : బిన్ లాడెన్, అల్ జవహరి ని చంపేసినప్పుడు అమెరికా ఎక్కడో సముద్రంలో పడేసింది. ఎందుకయ్యా అంటే ఆ శవాలను తిరిగి అప్పగిస్తే సమాధులు కట్టి, మళ్లీ వాళ్ల వారత్వానికి కొనసాగిస్తామని ఉగ్రవాదులు ప్రతిజ్ఞలు చేస్తారు కాబట్టి.. దీనివల్ల ఉద్రిక్తతలు చెలరేగుతాయి కాబట్టి.. అప్పట్లో ఎల్టీటీఈ ప్రభాకరన్, ఆయన కుటుంబ సభ్యులను శ్రీలంక ప్రభుత్వం చంపినప్పుడు.. శవాలను కూడా సముద్రంలోనే పడేసింది.. ఇందుకు సంబంధించి ఫోటోలను విడుదల చేసింది.. వారి శవాలను ఒకవేళ అయినవాళ్లకు అప్పగిస్తే… మళ్లీ ఉద్యమాలు చేస్తారని శ్రీలంక ప్రభుత్వం అనుమానం.. అయితే ఎప్పుడో చనిపోయిన ప్రభాకరన్ ఇప్పుడు బతికి ఉన్నాడు అంటూ ఈమధ్య తమిళ నాడు కు చెందిన నెడు మారన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతను లండన్ లో ఉన్నాడని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించాడు. అసలు చనిపోయిన ప్రభాకరన్ ఎలా బతికాడు? బతికే ఉంటే ఇన్నాళ్ళూ ఏం చేశాడు? ఇప్పటిదాకా ఎందుకు గోప్యంగా ఉంచారు? ఇప్పుడే ఎందుకు ఆ విషయాన్ని చెబుతున్నారు? దీని వెనుక ఉన్నది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అని అర్థమవుతోంది.. అంతకంతకు ఎదుగుతున్న బిజెపిని తొక్కేసేందుకు, అన్నామలై ని అణిచివేసేందుకు జరుగుతున్న కుట్ర ఇదని తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రం దక్షిణాది ప్రాంతంలో పూర్తి విభిన్నమైనది.. ఇక్కడ పెరియార్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.. తమిళ భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. వాస్తవానికి ఇవి మొదటి నుంచి ఉన్నవి కాదు.. తమిళనాడును పాలించిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఇంటి వారు ఇలాంటి వాటిని పాదుకొల్పారు. మత్స్య కారులు, బీసీ కులాలు అధికంగా ఉన్నచోటే ఇలాంటి సెంటిమెంట్ రగిలించారు.. ఫలితంగా అధికారంలోకి సులభంగా రాగలిగారు.. అందువల్లే జాతీయ పార్టీలను తమిళనాడు ప్రజలు అంత ఈజీగా తమ ప్రాంతంలోకి రానివ్వరు.. హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా పుట్టింది ఇందుకోసమే. పైగా తాంబేలు నాడు ప్రాంతంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా గుళ్ళు ఉంటాయి.. కంచి కామాక్షి, మధుర మీనాక్షి… చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో… కానీ ఈ గుళ్ళకు వెళ్లే ప్రజలను అక్కడ ఉన్న పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి.. వారిలో సెంటిమెంట్ ను రగిలించి ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి..
అయితే ఇప్పుడు దీనిని పూర్తిగా మార్చివేసే పన్లో పడ్డాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై. మొన్న ఆ మధ్య అతడు శ్రీలంక వెళ్లినప్పుడు.. తన వర్గం వారితో మాట్లాడాడు.. తమిళ నాడులో బిజెపి అధికారంలోకి వస్తే శ్రీలంకలో ఉన్న తమిళులకు ఎటువంటి వీసా లేకుండా భారతదేశాన్ని సందర్శించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు . ఇది బాగా పనిచేసింది.. శ్రీలంకలో ఉన్న తమిళలు తమిళ నాడు లో ఉన్న తమ బంధువులకు ఈ విషయం చెప్పడంతో… వారు గంపగుత్తగా ఓట్లన్నీ బిజెపికి వేయడంతో స్థానిక ఎన్నికల్లో కమలం పార్టీ రెండవ స్థానంలో నిలిచింది.. ఇది ఇలాగే కొనసాగితే తమకు నష్టమని భావించిన స్టాలిన్ ప్రభుత్వం… కొత్తగా తమిళ ఈలం సెంటిమెంట్ ని మళ్ళీ రగిలించే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే నెడుమారన్ తో ప్రభాకరన్ బతికే ఉన్నాడని వ్యాఖ్యలు చేయించింది. దీని ద్వారా తమిళ ఓటర్లను మళ్లీ సెంటిమెంటు వైపు రగిలించే ప్రయత్నం చేస్తున్నది. ఒకవేళ అన్నామలై ఆధ్వర్యంలో బిజెపి బలపడితే తమకు ఇబ్బంది కనుక… ఇలాంటి కుయుక్తులకు తెర లేపింది.. దీన్ని అన్నామలై ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాల్సి ఉంది.