
Janhvi Kapoor- NTR: ఎన్టీఆర్ 30లో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్. మరో నెలలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ తో జతకట్టే ఆ బ్యూటీ ఎవరో నిర్ణయించలేదు. దర్శకుడు కొరటాల శివ మొదట అలియా భట్ ని అనుకున్నారు. ఆమె ప్రాజెక్ట్ కి సైన్ చేయడం కూడా జరిగింది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. కియారాను సంప్రదించగా ఆమె కూడా నో చెప్పింది. తర్వాత రష్మిక మందానతో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నారని ప్రచారం జరిగింది. మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ కి జంటగా నటించడంపై జాన్వీ స్పందించారు.
Also Read: Hero Dhanush: తెలుగు బాష రానందుకు సిగ్గు పడుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో ధనుష్
ఎన్టీఆర్ గొప్ప యాక్టర్. ఆయనతో చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వదులుకోనని ఆమె వెల్లడించారు. అయితే ఫైనల్ గా ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా జాన్వీ కన్ఫర్మ్ అయ్యిందని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. జాన్వీ పై లుక్ టెస్ట్ కూడా జరిగిందట. ఆమె ఎన్టీఆర్ 30కి సంబంధించిన ఫోటో షూట్లో పాల్గొన్నారట. కాబట్టి ఎన్టీఆర్-జాన్వీ దర్శకుడు కొరటాల శివ మూవీలో కలిసి నటించబోతున్నారని టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. మరి అదే జరిగితే క్రేజీ కాంబో అయినట్లే.

జాన్వీ తల్లి శ్రీదేవి సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ మీద చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఆరాధ్య హీరోయిన్ గా కీర్తించబడ్డారు. ఆమె బాలీవుడ్ కి వలస వెళ్లినప్పటికీ సౌత్ చిత్రాలు చేశారు. ఆమె వారసురాలిగా ఇన్నేళ్ల తర్వాత తెలుగు మూవీలో నటించడం గొప్ప పరిణామం. ఇక సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ మీద చేసిన అద్భుతాలు అనేకం. వారి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ కొట్టాయి.
వారి వారసులైన జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కలిసి నటించడం చెప్పుకోదగ్గ విషయం. అనేక ప్రత్యేకతలతో కూడా కూడిన ఎన్టీఆర్-జాన్వీ కాంబో మిరాకిల్స్ చేసే ఛాన్స్ కలదు. ఇక ఫిబ్రవరి 24న అన్నపూర్ణ స్టూడియోలో ఎన్టీఆర్ 30 గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాన్వీ హాజరయ్యే సూచనలు కలవు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ జరపనున్నారు. గోవాలో కూడా ఈ మూవీ కోసం భారీ సెట్ రూపొందించారట. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read:Ram Charan Crush: ఆ హీరోయిన్ కి మొదటి చూపులోనే పడిపోయా… ఆమె నా క్రష్ అన్న చరణ్