
Grape Juice Health Benefits: ప్రస్తుతం చాలా మంది అల్కహాల్ కు బానిస అవుతున్నారు. తెల్లవారింది మొదలు పడుకునే వరకు తాగుతూనే ఉన్నారు. ఫలితంగా లివర్ డ్యామేజ్ అవుతోంది. దీంతో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అయినా వారి అలవాటు మార్చుకోవడం లేదు. తెల్లవారితే చాలు మద్యంతోనే మొదలవుతుంది వారి దిన చర్య. వారు ఎవరు చెప్పినా ఎంత చెప్పినా పట్టించుకోరు. వారిది ప్రత్యేక లేకం. దీంతో వారి ఆరోగ్యం క్రమక్రమంగా దెబ్బతింటుంది. లివర్ చెడిపోతే ఇక ప్రాణాలతో ఉండటం కష్టం. అందుకే లివర్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నా పట్టించుకోవడం లేదు. లివర్ పూర్తిగా పాడైపోతే ఇక మరణమే శరణ్యం.
లివర్ చెడిపోయిన వారికి ఓ దివ్య ఔషధం ఉంది. దీన్ని తీసుకోవడం వల్ల మన దేహం బాగుపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకు ఓ 500 ఎంఎల్ చొప్పున ద్రాక్ష రసం ఇస్తే లివర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లతో జ్యూస్ చేసుకుని తాగడం వల్ల ఇలాంటి చక్కని ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇందులో నిరింజిన్, నిరింజినిన్ అనే రసాయన సమ్మేళనాలు ఉండటం వల్ల ఇది తాగడం లివర్ కు సురక్షితమే. ద్రాక్ష పండ్ల రసంలో 300 నుండి 375 మిల్లీగ్రాముల వరకు ఈ సమ్మేళనాలు ఉండటంతో కణాల్లో ఇన్ ఫ్లామేషన్ రాకుండా చేస్తాయి.
అల్కహాల్ తీసుకునే వారిలో ఎక్కువగా కాలేయ కణాల నుంచి సైటో ప్లానం అనే ద్రవం వెలువడుతుంటుంది. దీంతో కాలేయం దెబ్బతినే ప్రమాదముంటుంది. కణాల గోడలు దెబ్బతిని సైటో ప్లానం బయటకు రాకుండా చేయడంలో కాలేయ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ద్రాక్ష పండ్ల రసం తోడ్పడుతుంది. ద్రాక్ష రసంలో ఉండే నిరింజిన్, నిరింజినిన్ సమ్మేళనాల కారణంగా ఎడిహెచ్ అనే ఎంజైమ్ తయారవుతుంది. ఇది అల్కహాల్ ను విడగొట్టడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. ద్రాక్ష పండ్ల రసంతో మూడు రకాల ప్రయోజనాలు దక్కుతాయి. ద్రాక్ష పండ్ల రసం తీసుకోవడం వల్ల అల్కహాల్ తీసుకున్నా నష్టం కలగకుండా ఈ రసం ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది అల్కహాల్ తాగకుండా ఉండటం లేదు. అలాంటి వారికి ద్రాక్ష పండ్ల రసం ఔషధంలా ఉపయోగపడుతుంది. ద్రాక్ష పండ్ల రసం తాగడం వల్ల అల్కహాల్ తీసుకున్నా పెద్దగా నష్టమేమీ ఉండదని చెప్పడంతో ఇక అందరు తాగుడుకు బానిసలయ్యే ఆస్కారం కూడా లేకపోలేదు. ఇప్పటికే సమాజంలో దాదాపు తొంబై శాతం మంది అల్కహాల్ తీసుకునే వారే. వారిని కంట్రోల్ చేయడం కష్టమే. వారి దినచర్య దీంతోనే ప్రారంభమవుతుందంటే నమ్మాల్సిందే. ఇంతటి ఉపద్రవం సృష్టిస్తున్న అల్కహాల్ కు దూరంగా ఉండటమే మంచిది.