
Moles On Tongue: మనలో చాలా అరుదుగా నాలుక మీద మచ్చ ఉన్న వారుంటారు. వారు అన్నారంటే అది కచ్చితంగా అవుతుందని చెబుతారు. నాలుక మీద మచ్చ ఉన్న వారు ఏ మాట అన్నా అది జరుగుతుంది. కోటిలో ఒక్కరికి ఉండే ఈ నాలుక మీద మచ్చ పూర్వజన్మ సుకృతం అంటారు. పూర్వజన్మలో పుణ్యాత్ములు సత్య సందులో అయిన వారికి నాలుక మీద మచ్చ వస్తుందని చెబుతారు. వీళ్లకు తెలియదు వీరు ఏదంటే అది జరుగుతుందని. అందుకే ఏది పడితే అది మాట్లాడుతుంటారు. ఎలాంటి నియమాలు పాటించరు. దీంతో ఎన్నో అనర్థాలకు కేంద్రంగా నిలుస్తారు.
వారి నోట్లో..
మంచి చెడు విచక్షణ ఉండదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియడం లేదు. వారి నోట్లో నోరు పెట్టడం అంత మంచిది కాదు. అలాంటి వారితో పెట్టుకోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఏదో ఒకటి అనేస్తే మనకు నష్టం కలుగుతుంది. సత్ర్పవర్తనతో ప్రవర్తించే వారు తక్కువ మంది ఉంటారు. వారికి దూరంగా ఉండటమే మంచిది. వారిలో కోపం వస్తే మనల్ని ఏదో ఒకటి అంటే దాని ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నాలుక మీద మచ్చ ఉన్న వారితో కొంచెం అప్రమత్తంగానే ఉండాలి.
దుష్టులకు దూరంగా..
దుష్టులకు దూరంగా ఉండాలని సామెత. మనం ఏది మాట్లాడినా వ్యతిరేక దిశలో అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు. దీంతో మనకు ఇబ్బందులు రావడం ఖాయం. నాలుక మీద మచ్చ ఉన్న వాళ్లతో మనం దూరంగా ఉండటమే మంచిది. వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. నాలుక మీద మచ్చ ఉంటే వారు ఏదంటే అది జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఇలా నాలుక మీద మచ్చ ఎవరికో కాదు. కోటిలో ఒకరికి ఉంటుంది. సక్రమ బుద్ధితో శుభవార్తలు మాట్లాడినా జరుగుతుంది.

మచ్చ ఉన్న వారితో..
నాలుక మీద మచ్చ ఉన్న వారితో మనం దూరంగా ఉంటే మనకు ఎలాంటి కష్టాలు రావు. వారు మంచి అన్నా చెడు అన్నా కుదురుతుంది. ఆ మాట అనకూడదనే విచక్షణ ఉండదు. అందుకే వారి ఆలోచన ప్రకారం వారు ముందుకు వెళతారు. కానీ ఇలా మచ్చ ఉన్న వారితో మనకు అభిప్రాయ భేదాలు ఉండకూడదు. దీంతో నాలుక మీద మచ్చ ఉన్న వారికి ఇబ్బందులు కలిగిస్తే మనకే నష్టం. ఈ నేపథ్యంలో మనకు వారితో చిక్కులు రాకుండా ఉండాలంటే దూరంగా ఉండటం ఒక్కటే మార్గం.