Homeఎంటర్టైన్మెంట్Waltair Veerayya Trailer : ట్రైలర్ రివ్యూ :‘వీడు నా ఎర.. నువ్వే నా సొర..’...

Waltair Veerayya Trailer : ట్రైలర్ రివ్యూ :‘వీడు నా ఎర.. నువ్వే నా సొర..’ చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బంపర్ హిట్టేనయ్యా

Waltair Veerayya Trailer  : ఒక డ్రగ్ స్మగ్లర్.. పేదల కోసం ఎలా నిలబడ్డాడు.. ఎలా పోరాడాడు. అడ్డు వచ్చిన మాఫియాను, బడాబాబులను , పోలీసులను ఎలా ఎదురించాడు… ఆద్యంతం చిరంజీవి మాస్, యాక్షన్, గ్రేస్ కలగలిపి.. బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు వస్తోంది ‘వాల్తేరు వీరయ్య’ మూవీ. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అసలు మాస్ జనాలకు పూనకాలు తెప్పించేలా ఉంది. మునుపటి ముఠామేస్త్రీ చిరంజీవి ని కళ్లకు కట్టేసింది.

పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోయే చిరంజీవి ఫ్యాన్స్ కు ఈ ట్రైలర్ చూశాకే నిజంగానే పూనకాలు వచ్చేశాయి. ఎందుకంటే పిక్చరైజేషన్ నభూతో నభవిష్యతిగా ఉంది. డైరెక్షన్ , సినిమాటోగ్రఫీ తెరపై చించేశారు. వాల్తేరు వీరయ్య మూవీలో హైలెట్ ఏంటంటే ‘ఆర్థర్ ఏ విల్సన్’అందించిన సినిమాటోగ్రఫీ హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంది. చిరంజీవి ఓ పాతికేళ్లు వెనక్కి జరిగినట్టు ఉంది. ఇక డైరెక్షన్ అనుకున్నదానికంటే బాబీ చింపేశాడని అర్థమవుతోంది. చిరంజీవిని చూపించిన విధానం.. ఫైట్లు, పాటలు, ఎమోషన్ లో అదిరిపోయిందనే చెప్పాలి.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ చూస్తే ఒక మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా చెప్పొచ్చు. ఇందులో రవితేజ కమిషనర్ గా ఒక పవర్ ఫుల్ తెలంగాణ పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, సత్యరాజ్ సహా భారీ తారగణం ఈ సినిమాలో నటిస్తోందని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

ముఖ్యంగా ట్రైలర్ లో చిరంజీవి వింటేజ్ మాస్ లుక్ కు పూనకాలు రావడం ఖాయమని ఆయన బాడీ లాంగ్వేజ్ ను బట్టి తెలుస్తోంది. డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్ చూస్తుంటే అదరిపోయేలా ఉన్నాయి. లాస్ట్ లో రవితేజ్ కు తనదైన మాస్ డైలాగ్స్ తో ఇచ్చిపడేసిన చిరంజీవిని ఇలా చూసి చాలా రోజులైంది. చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీసినట్టుగా కనిపిస్తోంది.

ట్రైలర్ చూస్తేనే కడుపు నిండిపోయింది.. ఇక సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. చూస్తుంటే సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఖచ్చితంగా చిరు ‘వాల్తేరు వీరయ్య’నే అనిపిస్తోంది. నిన్న విడుదలైన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ కంటే కూడా ఈ ట్రైలర్ బాగుందని చెప్పొచ్చు.

Waltair Veerayya Theatrical Trailer | Megastar Chiranjeevi | Ravi Teja | Shruti Haasan | Bobby | DSP

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version