
Viral Video: ఇటీవల అకస్మాత్త గుండె పోట్లు, కార్డిక్ అరెస్ట్‌లు ప్రాణాలు తీస్తున్నాయి. కారణం ఏంటో కాని ఇప్పటికే వందల మంది మృత్యువాత పడ్డారు. అప్పటి వరకు అందరితో ఆనందంగా గడుపుతూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. డ్యాన్స్, వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న షాకింగ్ ఘటనలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతిచెందాడు.
తపాలా శాఖలో ఉన్నతాధికారి..
మధ్యప్రదేశ్‌కు చెందిన సురేంద్రకుమార్‌దీక్షిత్ తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు సడెన్‌గా గుండెపోటు రావడం వల్లే మృతిచెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తన స్నేహితులతో కలిసి ఓ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన చుట్టూ చేరిన మిగతా వారు సాయం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
హాకీ టోర్నమెంట్..
తపాలా శాఖ మార్చి 13 నుంచి 17 వరకు 34వ ఆల్ ఇండియా పోస్టల్ హాకీ టోర్నమెంట్‌ను భోపాల్‌లోని మేజర్ ధ్యాన్‌చంద్ హాకీ స్టేడియంలో నిర్వహించింది. ఆఖరి మ్యాచ్ మార్చి 17న జరగనుండటంతో.. మార్చి 16న కార్యాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ పాటకు తోటి ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేసిన సురేంద్రకుమార్‌దీక్షిత్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
గత నెలలో నిర్మల్‌లో యువకుడు..
గతనెలలో నిర్మల్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు(18) నిర్మల్‌లోని బంధువుల పెళ్లికి కుటుంబ సభ్యులతో వచ్చాడు. పెళ్లి తర్వాత వరుడి ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ తర్వాత బంధువులు, కుటుంబ సభ్యులు సరదాగా డ్యాన్స్‌లు చేయడం ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన యువకుడు కూడా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలాడు. అయితే బంధువులు అది డ్యాన్స్‌లో భాగమే అనుకున్నారు. ఎంతకీ లేవకపోవడంతో వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు.

జనవరిలో ఇండోర్‌లో..
ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 16 ఏళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. చల్లని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక 11వ తరగతి చదువుతున్న వ్రిందా త్రిపాఠి.. స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. రిపబ్లిక్‌డే ఈవెంట్స్‌లో భాగంగా రిహార్సల్స్ కోసం వెళ్లిన బాలిక తన పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. దీంతో ఆస్పత్రికి తరలించగా వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.
మొత్తంగా కార్డిక్ అరెస్ట్‌లు ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. మన కళ్లముందే సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పిట్టల్లా రాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
बस आज की रात है जिंदगी…डांस करते वक्त एक अधिकारी अचानक गिरा, मौके पर मौत।वीडियो मध्यप्रदेश के भोपाल का है#SuddenDeath #heartattack2023#Bhopal #MadhyaPradesh #heartattack pic.twitter.com/iemf1Qxhs6
— PraDeep yadav (@parthshay) March 20, 2023