https://oktelugu.com/

Gorantla Rajendraprasad Away: చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!

Gorantla Rajendraprasad Away: చిత్రసీమకు ఏదో శాపం తగిలినట్టుంది. ఎవరో ఒకరు వీడిపోతూనే ఉన్నారు. సినీ ప్రముఖులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖులు మరణిస్తున్నారు. ఇప్పటికే ఎడిటర్ గౌతం రాజు మరణంతో టాలీవుడ్ విషాదంలో ఉండగా మరో ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్(86) కన్నుమూశారు. ఎడిటర్ గౌతం రాజు మరణం మరువకముందే మరో ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) పరమపదించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 7, 2022 / 01:40 PM IST
    Follow us on

    Gorantla Rajendraprasad Away: చిత్రసీమకు ఏదో శాపం తగిలినట్టుంది. ఎవరో ఒకరు వీడిపోతూనే ఉన్నారు. సినీ ప్రముఖులను శోక సంద్రంలో ముంచెత్తుతున్నారు. ఇటీవల కాలంలో ప్రముఖులు మరణిస్తున్నారు. ఇప్పటికే ఎడిటర్ గౌతం రాజు మరణంతో టాలీవుడ్ విషాదంలో ఉండగా మరో ప్రముఖ నిర్మాత కన్నుమూశారు.

    టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్(86) కన్నుమూశారు. ఎడిటర్ గౌతం రాజు మరణం మరువకముందే మరో ప్రముఖ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ (86) పరమపదించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

    గతంలో గోరంట్ల రాజేంద్రప్రసాద్ -రామానాయుడుతో కలిసి ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించారు. మాధవి పిక్చర్స్ బ్యానర్ లో ఆయన ‘దొరబాబు’, సుపుత్రుడు, కురుక్షేత్రం, ఆటగాడు వంటి సినిమాలను నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుపొందారు.

    ఇక రాజేంద్రప్రసాద్ మరణం వార్త విని సినీ పెద్దలు, టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఈ మేరకు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు.

    నిన్ననే ఎడిటర్ గౌతం రాజు మరణించగా.. ఆయన కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. ఎన్నో చిరంజీవి సినిమాలకు పనిచేసిన గౌతం రాజుకు ఈ రకంగా చిరంజీవి ఇతోదిక సాయం చేశారు.