Homeట్రెండింగ్ న్యూస్Google CEO Sundar Pichai House: సినీ నటుడికి ఇల్లు అమ్మిన గూగుల్ సీఈవో సుందర్...

Google CEO Sundar Pichai House: సినీ నటుడికి ఇల్లు అమ్మిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్: కన్నీటి పర్యంతమైన తండ్రి

Google CEO Sundar Pichai House: సుందర్ పిచాయ్.. గూగుల్ సీఈవో.. భారత మూలాలు ఉన్న వ్యక్తి. సంవత్సరానికి వేతనం వందల కోట్లలో ఉంటుంది. పైగా గూగుల్ సంస్థ నిర్వహించే ప్రతి పనిలోనూ ఇతడి భాగస్వామ్యం ఉంటుంది. లక్షల మంది ఉద్యోగులు ఇతడి ఆధ్వర్యంలోనే పనిచేస్తారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈయన తన సొంత ఇంటిని అమ్మాడు అంటే నమ్మగలమా? కానీ నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ఇంటిని అమ్మాడు. అది కూడా ఒక తమిళ సినీ నటుడికి.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సొంత రాష్ట్రం తమిళనాడు. ఆయన చెన్నైలో పుట్టాడు. అశోక్ నగర్ లోని సుందర్ పిచాయ్ కు ఒక ఇల్లు ఉంది. అయితే ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదు. పైగా సుందర్ అమెరికాలో స్థిరపడిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడికే వెళ్లారు. వారంతా కూడా అమెరికాలో సొంత ఇళ్ళు నిర్మించుకొని వివిధ వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయితే ఎవరూ ఉండకపోవడంతో ఆ ఇల్లు మొత్తం పాడుబడిపోయింది. దీంతో దానిని అమ్మాలని సుందర్ తల్లిదండ్రులు లక్ష్మి, రేగునాథ పిచాయ్ నిర్ణయించుకున్నారు. అలాగే ఇల్లు అమ్ముతామని తెలిసిన వారిద్వారా చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న తమిళ సినీ నటుడు మణికందన్ వెంటనే దానిని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. సుందర్ తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి.. ఆ ఇంటిని తన సొంతం చేసుకున్నారు.

కన్నీటి పర్యంతం

అశోక్ నగర్ లోని ఆ ఇంటి తో సుందర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సుందర్ ఆ ఇంట్లోనే పుట్టి పెరిగాడు. చెన్నైలో విద్యాభ్యాసం జరిగేంతవరకు ఆ ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఉండడం లేదు. దీంతో సుందర్ తండ్రి ఆ ఇంటిని అమ్మేశాడు. అంతేకాదు ఆ ఇంటిని అమ్ముతున్నప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాదు మణికందన్ పేరిట మార్చేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుందర్ తండ్రి గంటల తరబడి వేచి ఉన్నారు. స్థలం పత్రాలు ఇచ్చేందుకు అన్ని పనులు చెల్లించారు. అయితే ఇది తన తొలి ఆస్తి కావడంతో స్థలం పత్రాలు ఇచ్చేటప్పుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ఇల్లు పూర్తిగా పాడుబడిపోవడంతో దాన్ని కూలగొట్టేందుకు అయ్యే ఖర్చులు మొత్తం సుందర్ తండ్రి భరించాడు.. ఇక ఈ ఇంటిని కొనుగోలు చేసినందుకు గర్వంగా ఉందని మణికందన్ తెలిపాడు. గూగుల్ సీఈఓ గా ఎదిగిన సుందర్ ఈ ఇంట్లో నివసించడం వల్లే దానిని కొనుగోలు చేసేందుకు నేను ముందుకు వచ్చానని మణికందన్ వివరించాడు. ఇది తన జీవితంలో గర్వించదగ్గ పరిణామం అని పేర్కొన్నాడు. స్థలం కొనుగోలు చేస్తున్న సందర్భంగా సుందర్ తల్లిదండ్రుల మర్యాద తనను కంటతడి పెట్టించిందని పేర్కొన్నాడు. సుందర్ తల్లి తనకు స్వయంగా ఫిల్టర్ కాఫీ తయారు చేసుకుని ఇవ్వడం మర్చిపోలేనని మణికందన్ గుర్తు చేసుకున్నాడు.

అశోక్ నగర్ లోని ఇంట్లో సుందర్ 20 ఏళ్ల వరకు ఇక్కడే ఉన్నాడు. 1989లో ఐఐటి ఖరగ్ పూర్ లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. అక్కడ మెటలర్జికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి గూగుల్ అధిపతి అయ్యాడు. 2022 డిసెంబర్లో సుందర్ చెన్నై కి వచ్చినప్పుడు తన ఇంటిని సందర్శించాడు. సెక్యూరిటీ గార్డులకు తన పాత ఇంటి ఫర్నిచర్, వస్తువులు దానంగా ఇచ్చాడు. వారు ఇల్లు కట్టుకునేందుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరించాడు. అంతేకాకుండా వారితో తన ఇంటి బాల్కనీలో నిలుచుని ఫోటోలు కూడా తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆ ఇంటిని అమ్మడంతో సుందర్ కు ఉన్న మధురానుభూతులు జ్ఞాపకాలు గానే మిగిలిపోయాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular