
కేంద్ర విద్యాశాఖ నీట్ పరీక్ష రాసేవాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ సంవత్సరం నీట్ పరీక్ష రాసేవాళ్లకు ఛాయిస్ ఉండనుంది. కొద్దిరోజుల క్రితం జేఈఈ మెయిన్ పరీక్షలో ఛాయిస్ ఉన్నట్టు ప్రకటన వెలువడగా నీట్ పరీక్షలో సైతం ఛాయిస్ ఇవ్వనుంది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ప్రిపరేషన్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. గత ఏడాది సిలబసే ఈ ఏడాది కూడా నీట్ విద్యార్థులకు ఉండనుంది.
Also Read: కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్.. ఎనిమిది మందిలో ఒకరు మృతి..?
నీట్ పరీక్షను ప్రతి సంవత్సరం ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆఫ్ లైన్ లోనే పరీక్ష జరగనుంది. ప్రస్తుతం నీట్ పరీక్షలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నల చొప్పున 180 ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ ఏడాది ఒక్కో సబ్జెక్ట్ నుంచి 50 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నీట్ పరీక్ష తేదీ ఇంకా ఖరారు కాలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పరీక్షకు 1,20,000 మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు 15 లక్షల మంది పోటీ పడుతున్నారు.
Also Read: ‘మాస్టర్’ మూవీ వసూళ్లు చూస్తే షాకే..
నీట్ పరీక్షలో ఛాయిస్ ఇచ్చినప్పటికీ కొన్ని నిబంధనలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కేంద్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై నీట్ పరీక్ష రాసే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరం నిబంధనలకు సంబంధించి కీలక సవరణలు జరిగాయి. ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్.ఐ.టీలలో చేరాలంటే ఇంటర్ లో కనీసం 75 శాతం మార్కులతో పాస్ కావాలని నిబంధన అమలులో ఉండేది.
మరిన్ని వార్తల కోసం: వైరల్
ఈ నిబంధన వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కాదు. కనీస మార్కులతో ఇంటర్ పాసైనా జేఈఈ ఆడ్వాన్సెడ్ ర్యాంకులతో ఇంటర్ లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ నిబంధనలను వచ్చే విద్యాసంవత్సరానికి కూడా పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.