https://oktelugu.com/

రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి హైబీపీతో ఆపోలో ఆస్పత్రి పాలైన రజినీకాంత్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు రెండు రోజులుగా ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. Also Read: ప్రభాస్ కోసం దర్శకుడితో పూజ హెగ్డే గొడవ ! హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ కు వచ్చిన సందర్భంగా ఆయన సినిమా యూనిట్ లోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2020 / 09:21 PM IST
    Follow us on

    సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి హైబీపీతో ఆపోలో ఆస్పత్రి పాలైన రజినీకాంత్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు రెండు రోజులుగా ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

    Also Read: ప్రభాస్ కోసం దర్శకుడితో పూజ హెగ్డే గొడవ !

    హైదరాబాద్ లో తన సినిమా షూటింగ్ కు వచ్చిన సందర్భంగా ఆయన సినిమా యూనిట్ లోని ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. దీంతో వెంటనే చిత్రం షూటింగ్ బంద్ అయిపోయింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. రజినీకాంత్ కు పరీక్షలు చేయగా కరోనా సోకలేదని తేలింది. హైబీపీ కారణంగానే రజినీకాంత్ ఆరోగ్యం దెబ్బతిందని తేలింది.

    హైబీపీ కారణంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ హెల్త్ బులిటెన్ ను వైద్యులు తాజాగా విడుదల చేశారు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రేపు ఉదయమే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ఈమేరకు శనివారం రాత్రి రజినీకాంత్ హెల్త్ బులిటెన్ ను అపోలో వైద్యులు విడుదల చేశారు.

    Also Read: సంక్రాంతికి ‘అల్లుడు’ రాక ఫిక్స్.. అదరగొడతాడా ?

    రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈరోజు చేసిన టెస్ట్ లు అన్నిట్లో ఇబ్బంది కలిగించే అంశాలు ఏమి లేవని అపోలో ఆసుపత్రి పేర్కొంది. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉందని రాత్రి రక్త పోటు స్టేటస్ ఆధారంగా రేపు ఉదయం డిస్చార్జ్ చేసే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.

    గత 10 రోజులుగా ‘అన్నాత్తే’ షూటింగ్ కోసం రజనీ ఏకంగా 14 గంటల పాటు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో ఉంటున్నారు. రజినీకాంత్ వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. కాగా రజనీ ఆరోగ్యంపై వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్