https://oktelugu.com/

Prakash Raj-Krishna Vamsi: ప్రకాష్ రాజ్ ను సెట్ లో అందరి ముందు తిట్టిన కృష్ణవంశీ.. కారణం ఏంటంటే..?

కృష్ణవంశీ మాత్రం జనాల పల్స్ తెలుసుకొని ఎప్పటికప్పుడు అన్ని జానర్లను టచ్ చేసుకుంటూ సినిమాలు చేస్తు వచ్చాడు. ఇక ఈయన చేసిన సినిమాల్లో 'ఖడ్గం ' సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.

Written By:
  • Gopi
  • , Updated On : February 20, 2024 / 01:58 PM IST
    Follow us on

    Prakash Raj-Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు కృష్ణవంశీ. ఈయన మొదటి సినిమా అయిన గులాబి నుంచి మొన్న వచ్చిన రంగమార్తాండ సినిమా వరకు ప్రతి సినిమాలో తన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. నిజానికి వర్మ దగ్గర శిష్యరికం చేసిన దర్శకులలో కృష్ణవంశీ సపరేట్ రూట్ లో ఉంటాడనే చెప్పాలి. ఎందుకంటే వర్మ దగ్గర వర్క్ చేసిన దర్శకులందరికీ ఒక సపరేటు వే ఉంటుంది.

    గుణశేఖర్, తేజ లాంటి దర్శకులు వాళ్ళకి నచ్చినట్టుగా సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతారు. కానీ కృష్ణవంశీ మాత్రం జనాల పల్స్ తెలుసుకొని ఎప్పటికప్పుడు అన్ని జానర్లను టచ్ చేసుకుంటూ సినిమాలు చేస్తు వచ్చాడు. ఇక ఈయన చేసిన సినిమాల్లో ‘ఖడ్గం ‘ సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. హిందూ, ముస్లింల మధ్య ఉండే విభేదాలను తొలగిస్తూ అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం అనేది నిజంగా చాలా మంచి విషయం.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేసే టైంలో ప్రకాష్ రాజ్ చేయాల్సిన సీన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కృష్ణవంశీ అందరి ముందు ప్రకాష్ రాజ్ ని తిట్టాడట. దానికి ఫీల్ అయిపోయిన ప్రకాష్ రాజ్ కొద్దిసేపటి వరకు షూటింగ్ స్పాట్ కి రాకుండా సెట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడట. ఇక మొత్తానికైతే మళ్లీ కృష్ణవంశీ వెళ్లి ప్రకాష్ రాజ్ ని కూల్ చేసి సెట్ కి తీసుకొచ్చి, ఆయన చేత ఆ క్యారెక్టర్ లో నటింపచేశాడు.

    ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ కి థాంక్స్ చెప్పాడట, ఎందుకంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో మాత్రం ప్రకాష్ రాజ్ చూపించిన నటన నెక్స్ట్ లెవెల్ ల్లో ఉండడంతో ప్రకాష్ రాజ్ కి వరుసగా మంచి ఆఫర్లు కూడా వచ్చాయి…