https://oktelugu.com/

పురీషనాళంలో బంగారం పెట్టుకొని వచ్చాడు.. ఇలా దొరికాడు

కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ బంగారం గుట్టు రట్టయ్యింది. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నడకతీరుపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని లోపలికి తీసుకెళ్లి తనిఖీ చేశారు. అతడు పురీషనాళంలో బంగారం దోచుకున్నట్టు గుర్తించి వెలికితీయించారు. నిదితుడు మొత్తం 1096 గ్రాముల బంగారం మిశ్రమాన్ని ఐదు రబ్బర్ క్యాప్సూల్స్ లో నింపి వాటిని పురీషనాళంలో దాచుకున్నాడని అధికారులు తెలిపారు. బంగారాన్ని రబ్బర్ క్యాప్సూల్స్ లో నింపి వాటిని పురీషనాళంలో దాచుకొని కేరళలో ఫ్లైట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2020 7:48 pm
    Follow us on

    కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ బంగారం గుట్టు రట్టయ్యింది. షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నడకతీరుపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని లోపలికి తీసుకెళ్లి తనిఖీ చేశారు. అతడు పురీషనాళంలో బంగారం దోచుకున్నట్టు గుర్తించి వెలికితీయించారు.

    నిదితుడు మొత్తం 1096 గ్రాముల బంగారం మిశ్రమాన్ని ఐదు రబ్బర్ క్యాప్సూల్స్ లో నింపి వాటిని పురీషనాళంలో దాచుకున్నాడని అధికారులు తెలిపారు. బంగారాన్ని రబ్బర్ క్యాప్సూల్స్ లో నింపి వాటిని పురీషనాళంలో దాచుకొని కేరళలో ఫ్లైట్ దిగారు. అంతా బాగానే మేనేజ్ చేశారు. కానీ నడకతీరులో మార్పు చూసి చెక్ చేయగా అసలు విషయం వెలుగుచూసింది.

    కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలోనూ ఇదే తరహాలో బంగారం రవాణా చేస్తూ దొరికిపోయారు. సేమ్ ఫార్ములతో వచ్చిన ప్రయాణికుల నుంచి భారీగా బంగారం పట్టుబడింది. బంగారాన్ని తమ పురీషనాళంలో ఉంచుకొని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అధికారులు పట్టుకోవడం సంచలనమైంది.

    ఈ ముగ్గురి నుంచి దాదాపు 13.22.67 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు బంగారాన్ని పురీషనాళంలో పెట్టుకొన్నారని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.