Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది..మెగాస్టార్ రేంజ్ లో ఈ సినిమాకి ఆశించిన స్థాయి బాక్స్ ఆఫీస్ నంబర్స్ అయితే రాలేదు కానీ..ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత చిరంజీవి కి ఒక డీసెంట్ సినిమా పడిందనే పేరు మాత్రం వచ్చింది..ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అందరూ మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది..మెగాస్టార్ నుండి ఫ్యాన్స్ ఏవైతే కోరుకున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉండబోతున్నాయి..ఇది ఇలా ఉండగా మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రం కొద్దీ రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు మరియు హిందీ బాషలలో విడుదల చెయ్యగా, ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం..ముఖ్యంగా హిందీ వెర్షన్ ని ఆడియన్స్ ఎగబడిమరీ చూస్తున్నారు.
ఈ ఏడాది లో #RRR సినిమాని నెట్ ఫ్లిక్స్ వీక్షకులు ఇదే రేంజ్ లో చూసారు..సుమారు 14 రోజుల పాటు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగింది..గాడ్ ఫాదర్ చిత్రం నేటికీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై 12 రోజులైంది..ఈ 12 రోజులు ఈ సినిమా నెంబర్ 1 స్థానం లో కొనసాగడం విశేషం..ఎన్నో హాలీవుడ్ చిత్రాలు మరియు సిరీస్ లు ప్రతి వారం విడుదల అవుతున్నా కూడా గాడ్ ఫాదర్ చిత్రం నెంబర్ 1 స్థానం లో కొనసాగడం అంటే మాములు విషయం కాదు.

మరో మూడు రోజులు ఈ సినిమా అదే స్థానం లో కొనసాగితే #RRR రికార్డుని బద్దలు కొట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అంతే కాకుండా #RRR చిత్రం ఏకంగా 20 వారాలపాటు ట్రేండింగ్ లిస్ట్ లో నాన్ స్టాప్ గా కొనసాగింది..గాడ్ ఫాదర్ ఊపు చూస్తుంటే ఇది కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారు.