Hari Hara Veera Mallu: సౌత్ ఇండియా లో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీస్ లో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’..ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత AM రత్నం సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

అందులోనూ పీరియాడిక్ జానర్ కి సంబంధించిన సినిమా..OTT రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలతో కూడా ఆల్ టైం డే 1 రికార్డ్స్ పెట్టె సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి హీరో కి పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా దొరికితే కచ్చితంగా #RRR డే 1 రికార్డ్స్ రిస్క్ లో పడినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట.
ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ టాలీవుడ్ లో మరో స్టార్ హీరో కి లేదు..ఆయన సినిమాలు ఇక్కడ టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతాయి..ఆయన హీరో గా నటించిన గత చిత్రం ‘భీమ్లా నాయక్’ చిత్రం ఇక్కడ మొదటి రోజు ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది..హైదరాబాద్ సిటీ నుండి తెలంగాణలోని టౌన్స్ మరియు సి సెంటర్స్ వరుకు ఈ సినిమా ప్రతి చోట ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది.

ఒక రీమేక్ సినిమాతోనే ఇంతటి ప్రభంజనం సృష్టిస్తే, ఇక ‘హరి హర వీరమల్లు’ తో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో అని ట్రేడ్ పండితులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఇక్కడ #RRR చిత్రం మొదటి రోజు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది..హరి హర వీరమల్లు కి టికెట్ రేట్స్ ఇచ్చి, పాజిటివ్ టాక్ కనుక పడితే ఆ సినిమా #RRR రికార్డు ని బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.