Gobi Manchurian Banned: చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి మంచూరియా తింటే అబ్బ ఆ ఫీలింగే వేరు కదా. అందులో గోబి మంచూరియా అయితే మరింత ఎంజాయ్ గా ఉంటుంది. ఈ రెమెడీకి లవర్స్ ఎక్కువగానే ఉంటారు. దీన్ని చూస్తే తినకుండా ఉండగలరా? అయితే ఈ మంచూరియా ఇక సిటీలో కనిపించదట. కానీ మన సిటీలో కాదు. ఒక సిటీలో గోబీ మంచూరియాను తయారు చేయడం నిషేధించారు. అదేంటి గోబీ మంచూరియాను బ్యాన్ చేశారా? ఎక్కడా ఆ సిటీ ఎందుకు అలా చేశారు అని తెగ టెన్షన్ పడుతున్నారా? అయితే ఇది మీకోసమే..
మంచూరియాలో గోబి మంచూరియానే వేరయా అన్నట్టు ఈ మంచూరియాను తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ఆ సిటీలో కూడా అంతే కాదు అక్కడ బ్యాన్ అయిపోయింది. గోవాలోని మపుసా నగరంలో గోబీ మంచూరియా తయారీ, విక్రయాలపై స్థానిక అధికారులు నిషేధం విధించారట. అయితే ఈ మంచూరియాను అపరిశుభ్రంగా తయారు చేయడం.. దాని తయారీలో ప్రమాదకరమైన రంగులు వాడడం వంటి వాటివల్ల నిషేధం విధించారట అధికారులు. దీంతో గోవాలో మంచూరియా బ్యాన్ అయిపోయింది.
ఈ రెమెడీ కోసం వాడే సింథటిక్ రంగులు, దాని పరిశ్రుభ్రతపై ఆహార నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కారణంగా మపుసా మున్సిపల్ కౌన్సిల్ అధికారులు ఆ నగరంలో గోబీ మంచూరియా తయారీపై నిషేధం విధించారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, ఫంక్షన్స్ లోని గోబీ మంచూరియా తయారీ ఇక ఉండదన్నమాట. అయితే మపుసా నగరం కాకుండా మరో నగరంలో కూడా గోబీ మంచూరియాను ఇప్పటికే నిషేధించారు. 2022 సంవత్సరంలోనే మోర్ముగావ్ నగరంలో ఈ మంచూరియాపై నిషేధం విధించారు.
మోర్ముగావ్ లోని శ్రీ దామోదర్ ఆలయంలో వాస్కో సప్తాహ్ ఫెయిర్ సంర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో గోబీ మంచూరియన్ తయారీపై అక్కడి మున్సిపల్ కౌన్సిల్ కూడా నిసేధం విధించింది. అంతేకాదు ఫుడ్ అండ్ డ్రగ్స్ అధికారులు అక్కడి రెస్టారెంట్లు, ఫుడ్ స్టాళ్లపై దాడులు కూడా చేశారు. అప్పటి నుంచి ఈ మంచూరియా పూర్తిగా బ్యాన్ అయింది.