NTR
NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరిలో ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటించి ఇప్పించగలిగే సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనప్పటికీ ఒక్కొక్క సినిమాతో సక్సెస్ లను సాధిస్తూ, ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ వచ్చాడు. ఇక ఎన్టీఆర్ ఇప్పటికి కూడా ఒక సినిమా కోసం చాలా కష్టపడతాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా తను డాన్సుల్లో గాని, ఫైటింగ్ ల్లో గాని తనదైన వైవిధ్యాన్ని చూపిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇక ఎన్టీయార్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను కొట్టడానికి ఎన్టీఆర్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఎన్టీయార్ తన డ్రీమ్ రోల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇక ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించాడు.తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఏ దేవుడిని గుర్తు చేసుకోవాలన్న కూడా వాళ్ళకి మొదట ఎన్టీయార్ రూపమే గుర్తుకు వచ్చేది.
ఇక అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా వాళ్ల తాత మాదిరిగానే కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించాలనేది తన డ్రీమ్ రోల్ గా తెలియజేశాడు. మరి ఎన్టీఆర్ కి తన కెరియర్ లో కృష్ణుడి పాత్రను పోషించే అవకాశం వస్తుందా? లేదా? అంటూ మరి కొంతమంది కూడా ఈ విషయం మీద కామెంట్లు చేశారు.ఇక రాజమౌళి తీయబోయే మహాభారతంలో ఎన్టీఆర్ ని కృష్ణుడుగా పెట్టే అవకాశాలు ఉన్నాయా అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు.
ఇక ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ మాత్రం తన డ్రీమ్ రోల్ మీద పక్క ప్రణాళికతో ఉన్నట్టుగా తెలుస్తుంది.మొత్తానికైతే తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా ఆ పాత్రను పోషించి తీరుతానని కూడా ఎన్టీయార్ తన సన్నిహిత వర్గాల దగ్గర ఇప్పటికే చాలాసార్లు తెలియజేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి…