Jailer Song: రజినీకాంత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జైలర్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. రజినీకాంత్-తమన్నా పై తెరకెక్కించిన మాస్ బీట్ సాంగ్ ‘నువ్వు కావాలయ్యా’ యూత్ కి తెగ నచ్చేసింది. సాధారణ జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా రీల్స్ చేశారు. ఈ సాంగ్ అతి తక్కువ సమయంలో 153 మిలియన్ వ్యూస్ అందుకుంది. లక్షల్లో ఈ సాంగ్ పై రీల్స్ రూపొందాయి. తాజాగా కొందరు అమ్మాయిలు రైలు బోగీలో కావాలయ్యా సాంగ్ కి డాన్స్ చేశారు. తాము ప్రయాణిస్తున్న ట్రైన్ లో తోటి ప్యాసింజర్స్ మధ్య డాన్స్ చేసి సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోకి మిలియన్స్ కొద్దీ వ్యూస్ దక్కాయి. అదే సమయంలో ఆ అమ్మాయిలు విపరీతమైన క్రిటిసిజం ఫేస్ చేస్తున్నారు. పలువురు నెటిజెన్స్ వాళ్ళపై మండిపడుతున్నారు. పబ్లిక్ లో చేసిన న్యూసెన్స్ గా పరిగణిస్తున్నారు. తోటి ప్రయాణికులను డిస్టర్బ్ చేయడం మీకు సరదానా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరైతే వారికి ఫైన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరేమో సరదాగా తీసుకుంటున్నారు.
ఏది ఏమైనా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఇలాంటి రీల్స్ చేయడం సరికాదు. మన ఇంట్లోనో పెరట్లోనే వీడియోలు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇక సోషల్ మీడియా అనేది ఒక మానసిక రుగ్మతకు దారి తీసింది. పాపులారిటీ, లైక్స్ కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. చేయకూడని సాహసాలు చేస్తూ ప్రమాదంలో పడుతున్నారు. రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకులు చాలా మంది ఉన్నారు.
ఇక జైలర్ చిత్ర విషయానికి వస్తే… వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో జైలర్ డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. పెట్టుబడికి ముందు రెట్లు లాభాలు దక్కాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా రమ్య కృష్ణ, సునీల్ కీలక రోల్స్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో మెప్పించారు. జైలర్ 2023కి గానూ కోలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించింది.