Boys Hostel Review: భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు ఆదరణ తక్కువ కావడంతో కొంత మంది డైరెక్టర్లు కంటెంట్ ను నమ్మొకొని సినిమాలు తీస్తున్నారు. వారు చేస్తున్న ప్రయోగం చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు చిన్న సినిమాలదే హవా సాగుతోంది. లేటేస్టుగా కొత్త కుర్రాళ్లతో కలిసి యూత్ ను ఆకట్టుకునేందుకు ఓ సినిమాను తీసుకొచ్చారు. అదే ‘బాయ్స్ హాస్టల్’. ఈ సినిమా ఆగస్టు 26న థియేటర్లోకి వచ్చింది. ఈసినిమా ఎలా ఉందో చూద్దాం..
నటీనటులు:
ప్రజ్వల్ బీసీ
మంజునాథ్ నాయక్
శ్రీవాస్తవ
తేజజ్ జయన్న
రష్మి
టెక్నీషియన్స్:
డైరెక్టర్ : నితిన్ కృష్ణ మూర్తి
నిర్మాత : వరుణ్ గౌడ,నితిన్ కృష్ణ మూర్తి, ప్రజ్వల్, అరవింద్
సంగీతం : అజనీష్
ఎడిటింగ్ : సురేష్
కథ:
అజిత్ (ప్రజ్వల్) తన స్నేహితులతో కలిసి బాయ్స్ హాస్టల్ లో ఉంటారు. ఓ షార్ట్ ఫిలిం కోసం ఓ కథను రాసుకుంటాడు. ఇందులో భాగంగా తన హాస్టల్,రూమ్మేట్స్ తో జరిగే విషయాలను ఆధారంగా రాస్తాడు. వీరి హాస్టల్ లో వార్డెన్ (మంజునాథ నాయక్) చాలా కఠినంగా ఉంటాడు. విద్యార్థులు ఏ చిన్న తప్పు చేసినా ఆ విషయాన్ని ప్రిన్సిపాల్ కు చెబుతూ ఉంటాడు. దీంతో వార్డెన్ పై విద్యార్థులంతా కోపంతో ఉంటారు. అయితే ఓ రోజూ రాత్రి వార్డెన్ పై అంతస్తు నుంచి పడి చనిపోతాడు. అయితే ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు గా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తారు… ఇదే తన కథ అని అజిత్ తన స్నేహితులకు చెబుతాడు. అయితే ఇంతలో ఓ విద్యార్థి పరుగులు పెడుతూ వస్తూ వార్డెన్ చనిపోయాడని అంటాడు. అయితే వార్డెన్ ఓ సూసైడ్ లెటర్ రాసి చనిపోతాడు. ఇందులో అజిత్ తో పాటు తన రూమ్మేట్స్ పేర్లు సూసైడ్ లెటర్లో ఉంటాయి. ఇంతకీ ఎం జరుగుతుంది? అనేది స్టోరీ..
విశ్లేషణ:
ఈరోజుల్లో భారీ హంగామా చేయడం కంటే కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే మంచికంటెంట్ తో పాటు కామెడీని ప్రధానంగా చేసుకొని ఈ సినిమాను చిత్రీకరించారు. వార్డెన్ చనిపోయాడని తెలిసిన తరువాత జరిగే సీన్స్,కామెడీ ఆకట్టుకుంటుంది. ఆత్మహత్య చేసుకున్న వార్డెన్ బాడీని దాచేందుకు కుర్రాళ్లుచేసే ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది. ఇలా ఫస్టాఫ్ మొత్తం కామెడీలో ముంచి సెకండాఫ్ మలుపులు తిరుగుతుంది. దీంతో సినిమా ఆసక్తినిరేపుతుంది. అయితే హాస్టల్ ఉండే కుర్రాళ్లు పచ్చి తాగుబోతుల్లా ఇంత నీచంగా ఉంటారా? అనే విరక్తి కలిగేలా చూపించడం కొందరికి నచ్చకపోవచ్చు.
ఎవరెలా చేశారంటే?
సినిమాలపై ఆసక్తి ఉండడంతో చాలా మంది ఫస్ట్ మూవీతోనే బెస్ట్ యాక్టర్ గాఅనిపించుకుంటున్నారు.అందులో భాగంగానే ఇందులో నటించిన కుర్రాళ్ల తమ పాత్రల్లో లీనమైపోయారు. అయితే ఏ ఒక్క పాత్ర హైలెట్ కాకుండా అందరికీ ప్రాధాన్యంపెరిగింది. కాంతార ఫేం రిషబ్ శెట్టి, యూటర్న్ ఫేం పవన్ కుమార్ లు కూడా ఇందులో కనిపించారు. ఇకవార్డెన్ పాత్రలో మంజునాథ్ నాయక్ ఆకట్టుకుంటాడు. ఈ పాత్రచుట్టూ సినిమా తిరగడంతో ఆయన హైలెట్ గా మారాడు. డైరెక్టర్ కృష్ణమూర్తి మేధావిలా కనిపించి కడుపుబ్బా నవ్వించాడు. రష్మి ప్రారంభం నుంచి చివరి వరకు గ్లామర్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా ఎలా ఉందంటే?
ఇదోకసినిమా గా కాకుండా ఓ ప్రయోగంలా సినిమాను తీశారు డైరెక్టర్ నితిన్ కృష్ణ. ఓ వైపు డైరెక్టర్ గానే ఉంటూ సినిమాలో కనిపిస్తూ సందడి చేశారు. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. సినిమా టోగ్రఫీ ఆకట్టుకుటుంటుంది. సంగీఅజనీష్ తనసంగీతంతో ఆకట్టుకున్నాడు.
ముగింపు:
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న యూత్ కు ఈ మూవీ మంచి బూస్ట్ లాంటిది. అయితే సెకండాఫ్ లో కొన్ని రోటీన్ సీన్స్ ఉండడం మైనస్ గా మారింది. మొత్తంగా అల్లరి కామెడీతో ‘బాయ్స్ హాస్టల్’ ఆకట్టుకుంటుంది.
రేటింగ్ : 2.75/5