వామ్మో.. సింహాల మలానికి ఇంత డిమాండా?

మన నిజ జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా జర్మనీలో సింహం మలాన్ని భారీ మొత్తం చెల్లించి అక్కడి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మలాన్ని అమ్మడం ఏమిటి…? సింహం మలానికి అంత డిమాండ్ ఏమిటి…? అనే అనుమానాలు తలెత్తుతున్నాయా…? జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు మొదలుపెట్టిన కొత్త బిజినెస్ గురించి తెలుసుకుంటే ఈ సందేహాలకు సులువుగా సమాధానాలు లభిస్తాయి. కరోనా వైరస్ విజృంభణ వల్ల జర్మనీలోని ముంచీ అనే ప్రాంతంలోని […]

Written By: Navya, Updated On : August 21, 2020 5:38 pm
Follow us on

మన నిజ జీవితంలో జరిగే కొన్ని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా జర్మనీలో సింహం మలాన్ని భారీ మొత్తం చెల్లించి అక్కడి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. మలాన్ని అమ్మడం ఏమిటి…? సింహం మలానికి అంత డిమాండ్ ఏమిటి…? అనే అనుమానాలు తలెత్తుతున్నాయా…? జర్మనీలో క్రోనే సర్కస్ కంపెనీవాళ్లు మొదలుపెట్టిన కొత్త బిజినెస్ గురించి తెలుసుకుంటే ఈ సందేహాలకు సులువుగా సమాధానాలు లభిస్తాయి.

కరోనా వైరస్ విజృంభణ వల్ల జర్మనీలోని ముంచీ అనే ప్రాంతంలోని క్రోనో సర్కస్ కు భారీగా నష్టాలు వచ్చాయి. కొన్ని నెలల నుంచి సర్కస్ మూతబడటంతో ఉద్యోగులు ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో సర్కస్ లో పని చేసే వ్యక్తుల్లో ఒకరు ‘‘సింహం మలాన్ని అమ్ముకుందాం’’ అని జోక్ చేయగా సర్కస్ నిర్వాహకులు ఆ మాటను సీరియస్ గా తీసుకుని మలాన్ని జాడీల్లో పెట్టి అమ్మడం ప్రారంభించారు.

సర్కస్ నిర్వాహకులు తమ దగ్గర ఫ్రెష్ మలం లభిస్తుందని… దానిని ప్రాణ మిత్రులకు బహుమానంగా ఇవ్వాలని ప్రచారం చేశారు. సింహం మలాన్ని బహుమతిగా ఇవ్వడం కొత్తగా భావించిన ప్రజలు పెద్దఎత్తున కొనుగోలు చేయడం ప్రారంభించారు. రోజురోజుకు డిమాండ్ పెరగడంతో మలం గుర్తుతో ప్రత్యేక గుర్తును పెట్టి దుకాణం ఏర్పాటు చేశారు. ఒక్కో సింహం జాడీని మన దేశ కరెన్సీ ప్రకారం 445 రూపాయలకు విక్రయిస్తున్నారు. వీళ్లు ఊరికే సింహం మలాన్ని విక్రయిస్తుండగా కొందరు సింహం మలాన్ని ఎరువుగా వాడవచ్చని… సింహం మలం క్రిమీసంహాకరంగా పనిచేస్తుందని చెబుతున్నారు.