https://oktelugu.com/

Geetu Royal: ఆది రెడ్డి పై కుట్రలు చేస్తున్నారంటూ గీతూ రాయల్ సంచలన ఆరోపణలు

Geetu Royal: ఎన్నడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారు..వీరిలో సెలబ్రిటీస్ తో పాటు ఆది రెడ్డి వంటి కామన్ మ్యాన్ కూడా ఉన్నాడు..అంత మంది సెలబ్రిటీస్ ని తట్టుకొని ఒక కామన్ మ్యాన్ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..ఈ వారం ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు గెలుపొంది ఆది రెడ్డి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2022 / 11:07 AM IST
    Follow us on

    Geetu Royal: ఎన్నడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపారు..వీరిలో సెలబ్రిటీస్ తో పాటు ఆది రెడ్డి వంటి కామన్ మ్యాన్ కూడా ఉన్నాడు..అంత మంది సెలబ్రిటీస్ ని తట్టుకొని ఒక కామన్ మ్యాన్ ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..ఈ వారం ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు గెలుపొంది ఆది రెడ్డి మొట్టమొదటి ఫైనలిస్ట్ గా నిలుస్తాడని అందరూ అనుకున్నారు.

    Geetu Royal, Adi Reddy

    ఈ టాస్కు లో ఆయనకీ చివరి లెవెల్ ముందు వరుకు అత్యధిక పాయింట్స్ వచ్చి నెంబర్ 1 స్థానంలో కొనసాగాడు కూడా..కానీ ఆ తర్వాత శ్రీహాన్ తో పాయింట్స్ ‘టై’ అవ్వడం..ఆ తర్వాత బిగ్ బాస్ నిర్వహించిన ‘టై’ బ్రేకర్ టాస్కులో ఆది రెడ్డి ఓడిపోవడం తో ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కు నుండి ఆయన తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

    అయితే ఆదిరెడ్డి తో హౌస్ లో మొదటి నుండి ఎంతో క్లోజ్ గా ఉంటూ వచ్చిన గీతూ రాయల్ ప్రస్తుతం ఆది రెడ్డి ఆట తీరుపై సోషల్ మీడియా లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది..ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ప్రచారమయ్యే రూమర్స్ వల్ల ఆదిరెడ్డి డెంజర్ జోన్ లో పడిపోయాడు..టికెట్ 2 ఫినాలే టాస్కు గెలిచాడని అతని పై ఒక ఫేక్ రూమర్ బాగా స్ప్రెడ్ చేసారు..అందువల్ల అతని వోటింగ్ శాతం బాగా పడిపోయింది ..ఒక రివ్యూయర్ గా నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను..’టికెట్ 2 ఫినాలే’ టాస్కు గెలిచినా తర్వాత కూడా ఆ వారం సదరు కంటెస్టెంట్ ఆడియన్స్ వోటింగ్ ద్వారా సేఫ్ అయితేనే ఉపయోగం ఉంటుంది అని.

    Geetu Royal

    ఇప్పుడు ఆది రెడ్డి కి పాపం టికెట్ దక్కలేదు..వోటింగ్ కూడా పడిపోయింది..పాపం తన తలరాత అలా రాసిపెట్టుంది..అతని పట్ల నేను చాలా బాధపడుతున్నాను..అతను డెంజర్ జోన్ లో ఉన్న విషయం వాస్తవమే..కానీ కామనర్ గా , రివ్యూయర్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు లాంటి సొల్లు మొత్తం పక్కన పెడితే ఆది రెడ్డి గేమ్ అద్భుతంగా ఆడాడు..టాస్కులు చాలా న్యాయబద్దం గా ఆడాడు..ఈరోజు వోటింగ్ కి ఆఖరి రోజు..దయచేసి అందరూ అతనికి ఓట్లు వెయ్యండి’ అంటూ గీతూ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్టు వైరల్ గా మారింది.

    Tags