https://oktelugu.com/

Geetha Karmikudu: ఒక ఐడియా గీతన్న రాత మార్చింది.. వీడియో వైరల్‌!

ఒకప్పుడు కల్లుకు బాగా ఆదరణ ఉండేది. కానీ, తర్వాత మద్యం అమ్మకాలు పెరగడంతో కల్లుకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే గీత కార్మికుల సంఖ్య తగ్గుతోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 24, 2024 / 04:05 PM IST

    Geetha Karmikudu

    Follow us on

    Geetha Karmikudu: కల్లు.. తాటి, ఈత చెట్టు నుంచి వచ్చే ఈ కల్లు తెలంగాణలో ఒక ట్రెడిషన్‌. దీనిని మెడిసిన్‌గా కూడా భావిస్తారు. ఈ కల్లులో వెరైటీలు కూడా ఉన్నాయి. నీరా అని, పొద్దాటి కట్టు అని, పరుపుతాడు, నాపతాడు, కర్రకల్లు, ఈత కల్లు అని ఉంటాయి. పోద్దాటి కల్లు అంటే చాలా మంది ఇష్టంగా తాగుతారు. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల పాటు ఈ పోద్దాటి కల్లు సీజన్‌ ఉంటుంది. పిల్లలు, పెద్దలు, స్త్రీ, పురుష బేధం లేకుండా దీనిని సేవిస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెబుతారు.

    మారుతున్న ట్రెడిషన్‌..
    ఒకప్పుడు కల్లుకు బాగా ఆదరణ ఉండేది. కానీ, తర్వాత మద్యం అమ్మకాలు పెరగడంతో కల్లుకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు తాటిచెట్టు ఎక్కి కల్లు తీసే గీత కార్మికుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం జనరేషన్ తాటి చెట్లు ఎక్కేందుకు సాహసం చేయడం లేదు. ఆసక్తి చూపడం లేదు. దీంతో కల్లు ఉత్పత్తి తగ్గిపోయింది. అయితే మద్యంతో పోలిస్తే కల్లు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు చాలా మంది మళ్లీ కల్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో గీత కార్మికులకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో కల్లు తాగేవారు, కొనేవారు లేరు. దీంతో గీత వృత్తిని ప్రోత్సహించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం నీరా కేఫ్‌లు పెట్టాలని నిర్ణయించింది. ఈమేరకు హైదరాబాద్‌లో ఒక కేఫ్‌ ప్రారంభించారు. అయినా, చాలా గ్రామాల్లో కల్లు అమ్ముడుపోక గీత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

    గీతన్న ఐడియా అదుర్స్‌..
    అయితే.. అందరిలా కాకుండా ఓ గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు. చెట్టుపై నుంచి దించిన కల్లును బాటిళ్లలో నింపుకుని, ద్విచక్రవాహనంపై పెట్టుకుని గ్రామాలకు వెళ్తున్నాడు. దీంతో అతని కల్లు బాగా అమ్ముడవుతోంది. తీసిన కల్లును తాటి వనంలో పెట్టుకుని కూర్చుంటే గిరాకీ రాకపోవడంతో గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు. దీంతో తాటి వనంలోకి రావడానికి మొహమాట పడేవారు కల్లు ఎక్కువగా కొంటున్నారని తెలుస్తోంది. ద్విచక్రవాహనానికి కల్లు అమ్మే వాయిస్‌ను మైక్‌లో రికార్డు చేసి దానిని బైక్‌కు తగిలించుకుని ఊళ్లబాట పడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.