
Gayathri Bhargavi: తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకూ ప్రాధాన్యత ఉంటుంది. చాలా సినిమాల్లో వదినగా.. అక్కగా.. కనిపించిన గాయత్రి భార్గవి గురించి తెలిసే ఉంటుంది. టీవీ యాంకర్ గా కెరీర్ స్ట్రాట్ చేసిన ఈమె పలు సక్సెస్ సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అయితే గాయత్రి భార్గవి సినిమాల్లోకి వచ్చినప్పుడు మాములు నటినే. కానీ ఆమె వెనుక సినీ బ్యాగ్రౌండ్ ఉందన్న విషయం ఆమె చెప్పేదాకా తెలియదు. ప్రముఖ డైరెక్టర్ బాపు మనువరాలు గాయత్రి భార్గవి అనే విషయం ఆమె చెప్పగానే అంతా షాక్ అయ్యారు. మరెందుకు ఇన్నాళ్లు ఈ విషయం దాచారు? అని అడిగితే ఆమె కొన్ని ఆషక్తికర విషయాలను మీడియా ముందుంచారు. వాటి వివరాల్లోకెళ్తే.
సినిమాల ఇండస్ట్రీలో ఇప్పుడు కొనసాగుతున్న చాలా మంది వారసత్వంతో వచ్చిన వారు. తల్లి, తండ్రి లేదా మేనమామ.. ఇలా ఏదో ఒక బంధం పేరు చెప్పి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కొందరు తమ సినిమాల్లో సీనియర్ నటులు పేర్లు చెబుతూ తమ వారసత్వం గురించి చెబుతూ ఉంటారు. కానీ గాయత్రి భార్గవి మాత్రం తన తాత బాపు అని చెప్పడం అస్సలు ఇష్టం లేదట. తన సొంత టాలెంట్ ద్వారా సినిమాల్లోకి వచ్చి అవకాశాలు దక్కించుకున్నారట. మొదట్లో యాంకర్ గా గుర్తింపు పొందిన ఈమె ఆ తరువాత పలు సినిమాలో నటించారు.
గాయత్రి భార్గవి 1984 సెప్టెంబర్ 18న హైదరాబాద్ లో జన్మించారు. పాఠశాల విద్యమొత్తం ప్రైవేట్ లో సాగింది. ఈమె తండ్రి శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యురాలు. అందుకే ఆమెకు కళలపై ఆసక్తి పెరిగింది. దీంతో ఆమె ‘మెట్రో కథలు’ అనే సీరియల్ ద్వారా టీవీరంగంలో అడుగుపెట్టారు. ఆ తరువాత యాంకర్ గా మారి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ లాంటి వారిని ఇంటర్యూలు చేసి ఆకట్టుకున్నారు.

యాంకర్ గా గుర్తింపు పొందిన తరువాత సినిమాల్లో సైడ్ పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. అయితే గాయత్రి భార్గవి తల్లిదండ్రుల పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆమె బాపు గారి మనువరాలు అని చెబుతున్నారు. దీంతో ఇంతకాలం ఈ విషయం ఎందుకు దాచారు? అని అడగ్గా.. తనకు బ్యగ్రౌండ్ చెప్పి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదన్నారు. సొంత ప్రతిభతోనే సినిమాల్లోకి రావాలని అనుకున్నట్లు చెప్పారు.