Ganesh Laddu Auction: మామూలు పోటీ కాదు. ఒకరికి మించి ఒకరు.. ఏమాత్రం తగ్గలేదు. హోరాహోరి.. ఒకరు పది లక్షలు అంటే… ఇంకొకరు 20 లక్షలు.. ఇలా పెరుగుకుంటూ పోయింది రేటు. మామూలుగా అయితే హైదరాబాదులో బాలాపూర్ లడ్డూకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దాన్ని వేలంలో సొంతం చేసుకోవాలని చాలామంది పోటీ పడుతుంటారు. బాలాపూర్ లడ్డును.. రాయదుర్గం మై హోమ్ భుజ లడ్డూను మించి.. ధర సొంతం చేసుకుంది రాజేంద్రనగర్ లోని సన్ సిటీ ప్రాంతంలోని రిచ్మండ్ విల్లా..
పేరుకు తగ్గట్టుగానే ఈ విల్లాలో అందరూ శ్రీమంతులే ఉంటారు. ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే వినాయక చవితి వేడుకల్లో లడ్డువేలం ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటుంది. అందరూ శ్రీమంతులే ఉండడంతో ఈ లడ్డును సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుంటారు. తాజాగా ఈ ఏడాది గణపతి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు నుంచి మొదలు పెడితే చివరి రోజు వరకు వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ప్రతిరోజు స్వామి వారికి విశేష పూజలు.. అన్నదానాలు వంటివి నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామివారి లడ్డును వేలం వేశారు. వేలంలో అందరూ పోటాపోటీగా పాల్గొన్నారు. అందరూ శ్రీమంతులే కావడంతో.. లడ్డుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
గత ఏడాది 1.97 కోట్లు
గత ఏడాది ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా 1.87 కోట్లకు అమ్ముడు పోయింది. ఈసారి 2.32 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోల్చితే 45 లక్షలు అదనంగా వచ్చాయి.. ఈ లడ్డును ఓ వ్యాపారి సొంతం చేసుకున్నారు. ఇక్కడ లడ్డు చాలా ఫేమస్ అని.. దానిని సొంతం చేసుకుంటే వ్యాపారాలలో విజయం లభిస్తుందని.. అందుకే దానిని పొందడానికి చాలామంది వ్యాపారులు పోటీ పడుతుంటారు. ఈ విల్లాలో ఉన్న ఓ వ్యాపారి ఏకంగా 1.87 కోట్లకు సొంతం చేసుకున్నారు. అయితే వేలం ద్వారా వచ్చిన డబ్బులతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో లడ్డు వేలం నిర్వహించినప్పుడు వచ్చిన డబ్బులతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని.. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తామని నిర్వాహకులు అంటున్నారు. 2.32 కోట్లు లడ్డుకు ధర పలకడం హైదరాబాదులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆల్ టైం రికార్డ్ అని తెలుస్తుంది.
రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లకు వినాయక లడ్డూ వేలంపాట
హైదరాబాద్ రిచ్మండ్ విల్లాస్లో లడ్డూను వేలంలో రూ.2 కోట్ల 31 లక్షల 74 వేలకు దక్కించుకున్న కమ్యూనిటీ సభ్యులు pic.twitter.com/VYZThBjXlm
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025