మీకు బ్యాంకులో అకౌంట్ ఉందా..? తరచూ బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? అయితే డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిబంధనలు మారనున్నాయి. బ్యాంకులో లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. తరచూ లావాదేవీలు చేసేవాళ్లు కొత్తగా అమలులోకి వచ్చే నిబంధనల గురించి తెలుసుకుంటే మంచిది. ఆర్జీటీస్ సేవల విషయంలో డిసెంబర్ 1 నుంచి టైమింగ్స్ మారనున్నాయి.
ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీఎస్ సేవలు అందుబాటులో ఉండగా డిసెంబర్ 1వ తేదీ నుంచి రోజంతా ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ టైమింగ్స్ లో మార్పులు చేయడం ద్వారా బ్యాంకు ఖాతాదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. డిసెంబర్ 1 నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రోజులో ఏ సమయంలోనైనా నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది.
ఆర్బీఐ ఖాతాదారులకు పరిమిత సమయం సేవలు అందించడం ద్వారా ఖాతాదారులు నష్టపోతున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలోని ఫైనాన్షియల్ మార్కెట్లు ఉండే విధంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో నెఫ్ట్ సేవలు కూడా పరిమిత సమయం ఉండగా ఆర్బీఐ నిబంధనలలో మార్పులు చేసి రోజంతా నెఫ్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇతరులకు బదిలీ చేయాలంటే ఆర్టీజీఎస్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అయితే భారీ మొత్తంలో నగదు లావాదేవీలు చేసినా ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. 2 లక్షల రూపాయల లోపు నగదు లావాదేవీలకు మాత్రం నెఫ్త్ ద్వారా బదిలీ చేయాల్సి ఉంటుంది.