Pakistan : పై ఉపోద్ఘాతం మంచి ట్రాక్ రికార్డు ఉన్న దేశాలకు మాత్రమే వర్తిస్తుంది. అంతేతప్ప ఉగ్రవాదులతో అంట కాగి.. ఉగ్రవాదులకు స్థావరంగా మారి.. ఉగ్రవాదులను పందులను మేపినట్టు మేపే దేశాలకు అది వర్తించదు.. కాకపోతే ఉగ్రవాద దేశాలకు సహాయం చేసే దేశాలు కూడా ఆ జాబితా కిందకి వస్తాయి. పైగా వాటిని ప్రకృతి, పైన ఉన్న దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు. ఇందులో ఏమాత్రం అనుమానాలు లేదు.. ప్రస్తుతం ఇలాంటి అనుభవాన్ని తుర్కియో దేశం అనుభవిస్తోంది. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి సహాయం చేసి నరకం చూస్తోంది. తుర్కియో చేసిన వెదవ పని వల్ల ఇప్పుడు ఆ దేశ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Also Read: పాక్ కు సాయం చేసినందుకు ఎంత లాసో తెలుసా?
మనం అంత సహాయం చేసినప్పటికీ..
గతంలో తుర్కియో లో భూకంపం చోటు చేసుకుంది. అప్పుడు ప్రపంచ దేశాల కంటే ముందుగానే భారత్ స్పందించింది. వెంటనే ఔషధాలు, ఆహార పదార్థాలు తుర్కియో కు పంపించి తన మానవతను చాటుకుంది. కానీ పాముకు పాలు పోస్తే.. విషమే చిమ్ముతుంది అన్నట్టుగా..తుర్కియో తన నీచ బుద్ధిని చాటుకుంది. ఆపరేషన్ సిందూర్ లో మనకు కాకుండా.. ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కు సహకరించింది. మిస్సైల్స్ సహాయాన్ని అందించింది. చివరికి సైనికులను కూడా ఉగ్రవాద దేశానికి పంపించింది.. ఫలితంగా తుర్కియో పై భారత్ వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. మన దేశం నుంచి పర్యాటకులు తుర్కియో కు వెళ్లకుండా నిలువరించగలుగుతోంది. ఇక ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే ఆపిల్స్ ను నిలుపుదల చేసింది. చివరికి విమానాశ్రయంలో చేసే తనిఖీలను కూడా పక్కనపెట్టింది. మొత్తంగా చూస్తే తుర్కియోకు భారత్ చుక్కలు చూపిస్తోంది. పరిస్థితి ఇంత దిగజారినప్పటికీ..తుర్కియో పరిపాలకుడు పాకిస్తాన్ జపాన్ని మర్చిపోవడం లేదు. పైగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే.. ఉగ్రవాద దేశానికి అండగా ఉంటామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.. ఇక ఇప్పుడు తుర్కియోలో భూకంపం చోటుచేసుకుంది. నష్ట తీవ్రత ఎంతో తెలియదు. గతంలో భూకంపం చోటు చేసుకున్నప్పుడు భారత్ ఆపన్న హస్తం అందించింది. ఇప్పుడు అలాంటి హస్తం అందివ్వడానికి భారత్ సిద్ధంగా లేదు. పోనీ పాకిస్తాన్ ఏమైనా సహాయం చేస్తుందా అంటే.. అదే బిచ్చం ఎత్తుకుంటుంది.. ఇక సహాయం మాత్రం ఏం చేస్తుంది.. అందుకే అంటారు చెడ్డవాడితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమేనని.. అది తుర్కియో కు అనుభవంలోకి వచ్చింది. మరి ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటుందా? పాకిస్తాన్ కంటే దిగజారుతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు భూకంపం వల్ల తుర్కియో దేశంలో నష్టం భారీగానే వాటిలిందని అంతర్జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
Also Read : భారత్ – పాక్ ఉద్రిక్తతలు.. దాయాది దౌత్యవేత్త బహిష్కరణ
#Earthquake of magnitude 5.2 hits #Turkey, tremors felt across several provinces. pic.twitter.com/DD6TZMDysz
— IDU (@defencealerts) May 15, 2025