Chiranjeevi and Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిరంజీవి బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాలుగు పిల్లర్స్ లా ఎదిగారు. అప్పట్లో నాగార్జున తనదైన రీతి లో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా వెలుగొందుతూ ముందుకు సాగాడు. మరి ఇలాంటి సందర్భంలోనే శివ సినిమా తర్వాత ఆయన క్రేజ్ అమాంతం తార స్థాయికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆయన వరుసగా మాస్ సినిమాలను సైతం చేయగలడు అనే ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నా. ఇక వరుసగా ఇటు ఫ్యామిలీ అటు మాస్ యాక్షన్ సినిమాలను చేస్తూ వచ్చాడు. అయితే నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఆఖరి పోరాటం సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారుతుంది అని అనుకున్న లోపే చిరంజీవి హీరోగా వచ్చిన ‘యముడికి మొగుడు’ (Yamudiki Mogudu) సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ వసూళ్లను కాబట్టి లాంగ్ రన్ లో 100 రోజులకు పైన ఆడటమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే మెగాస్టార్ చిరంజీవి వల్ల నాగార్జున సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారలేకపోయింది…ఇక 1994వ సంవత్సరంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘హలో బ్రదర్’ (Hallo Brother) సినిమా రిలీజ్ అయింది.
ఇవివి సత్యనారాయణ (EVV Satya Narayana)దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా మారబోతున్న సందర్భంలో బాలయ్య బాబు ‘భైరవద్వీపం’ సినిమా వచ్చి డామినేట్ చేస్తూ భారీవసూళ్లను కొల్లగొడుతూ ముందుకు సాగింది… ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయింది.
మొత్తానికైతే చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు కలిసి నాగార్జున ను ఇండస్ట్రీ హిట్టు కొట్టకుండా ఆపేశారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం నాగార్జున తన వందో సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటించి మెప్పించడానికి సిద్ధమయ్యాడు.
ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ను చూసిన ప్రతి ప్రేక్షకుడు నాగార్జున ఈ సినిమాతో ఒక సంచలనాన్ని సృష్టించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేస్తున్నారు…ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తన వందో సినిమాని స్టార్ట్ చేసి ఎలాగైనా సరే ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం నాగార్జున ఉన్నట్టుగా తెలుస్తోంది…