పేటీఎం యాప్ పేరుతో మోసం.. లక్షల రూపాయలు ఖాతాల్లో మాయం..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహనను పెంచుతున్నప్పటికీ సైబర్ మోసాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. పేటీఎం కేవైసీ అప్ డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ సజ్జనార్ మోసగాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి కీలక విషయాలను వెల్లడించారు. మోసగాళ్లు పేటీఎం యాప్ ఉపయోగించే కస్టమర్లకు కాల్ చేసి మొదట కేవైసీ అప్ డేట్ చేయాలని కోరతారు. యాప్ అప్ […]

Written By: Navya, Updated On : October 14, 2020 9:05 am
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహనను పెంచుతున్నప్పటికీ సైబర్ మోసాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది. పేటీఎం కేవైసీ అప్ డేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ సజ్జనార్ మోసగాళ్లను మీడియా ముందు ప్రవేశపెట్టి కీలక విషయాలను వెల్లడించారు. మోసగాళ్లు పేటీఎం యాప్ ఉపయోగించే కస్టమర్లకు కాల్ చేసి మొదట కేవైసీ అప్ డేట్ చేయాలని కోరతారు.

యాప్ అప్ డేట్ కావాలంటే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నుంచి ఒక రూపాయి డిపాజిట్ చేయాలని తెలుపుతారు. ఒక రూపాయి చిన్న మొత్తమే కావడంతో చాలామంది అందుకు అంగీకరించి రూపాయి మోసగాళ్లు చెప్పిన ఖాతాలలో జమ చేస్తున్నారు. అనంతరం వాళ్లు రిమోట్ యాక్సెస్ తో సేకరించిన వివరాల ఆధారంగా అకౌంట్లలోని డబ్బులను ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి వివరాలను సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు.

కైవైసీ అప్ డేట్ మోసం వల్ల హైదరాబాద్ కు చెందిన వినయ్ శర్మ అనే బాధితుడు ఏకంగా 4.29 లక్షల రూపాయలు మోసపోయాడని సమాచారం. జార్ఖండ్‌లోని జంతార జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మోసగాళ్ల నుంచి 1,47,000 రూపాయల నగదుతో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సీపీ సజ్జనార్ మాట్లాడుతూ మోసాలకు పాల్పడిన వాళ్లంతా నేరాలు చేయడంలో ఆరితేరిన వాళ్లని చెప్పారు. అపరిచిత వ్యక్తుల నుంచి పేటీఎం కేవైసీ అప్ డేట్ పేరుతో కాల్స్ వస్తే వారి మాటలు గుడ్డిగా నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. తరచూ ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండటంతో ఈ మోసాలపై అవగాహన ఏర్పరచుకుంటే మాత్రమే మోసపోకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.