
Monkey Helped Cat : మన పూర్వీకులు కోతులు.. అందేరూ అందనిలె వాటి లక్షణాలు ఎప్పుడో ఒకసారి బయటపడుతూనే ఉంటాయి. అయితే.. బిజీ లైఫ్‌లో మనం సాటివారిని పట్టించుకోవడం మానేశాం. కానీ, మన పాత తరం మాత్రం జాతివైరం కూడా మరిచి ప్రేమను పంచుతున్నాయి. ఇందుకు తాజాగా ఉదాహరణ ఇది.
మార్జాలానికి మంకీసాయం..
మార్జాలం(పిల్లి), కోతి మంచి మిత్రులు. రెండు జంతువుల జాతి వేరైనా అవి కలిసే ఉంటున్నాయి. తనకంటే చిన్నది అయిన ఆ పిల్లిని కోతి అల్లారు ముందుగా చూసుకుంటోంది. అయితే అనకోకుండా ఒక రోజు ఆ పిల్లి పిల్ల ఓ గుంతలో పడింది. పైకి ఎక్కరాకపోవడంతో అది అందులోనే అరుస్తూ ఉండిపోయింది. మిత్రుడు అపాయంలో ఉన్నాడని గుర్తించిన కోతి దానికి కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్య కలిగిస్తోంది.
మిత్రుడి కోసం శతవిధాలా…
పక్కోడికి ఏమైతే మనకేంటి అని అనుకుంటున్న ఈరోజుల్లో ఓ మూగజీవి తన మిత్రుడుని కాపాడేందుకు సాహసమే చేసింది. గుంతలో పడిని పిల్లిని పైకి తెచ్చేందుకు తాను కూడా గుంతలో దిగింది. పిల్లిని తీసుకుని పైకి రావడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కోతి కూడా చిన్నది కావడం, పిల్లి అప్పలికే తడిసి పోయి ఉండడం, కోతిపాల పిల్లికి పట్టుకోవడం తెలియకపోవడంతో కోతి పడరాని పాట్లు పడింది. చివరకు ఓ అమ్మాయి వచ్చి.. పిల్లి కూనను పైకి తీసుకు వచ్చింది. అయితే కోతికి కోపం వచ్చింది. తన మిత్రుడిని ఆ అమ్మాయి ఏమైనా హాని తలపెడుతుందేమో అని భావించింది. కానీ జాగ్రత్తగా పిల్లిని బయటకు తీయడంతో కోతి పిల్లిని హత్తుకుని మురిసిపోయింది. ఇక ఆ అమ్మాయి.. తడిసిన పిల్లిని తుడిచింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కోతి సాహసాన్ని, మిత్రుడిపై కోతికి ఉన్న ప్రేమను నెటిజన్లు మెచ్చుకుటున్నారు. షభాష కోతి అంటూ అభినందిస్తున్నారు.