Forest Bathing: పెత్తనం సాగించే క్రమంలో ప్రకృతిని పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు. తన జీవితాన్ని.. జీవనాన్ని మరింత సుఖవంతంగా చేసుకోవడం కోసం అభివృద్ధి అనే ముసుగు ధరించాడు. ఇందుకోసం ఎంతటి దారుణాల కైనా.. మరింతటి విధ్వంసాలు చేయడానికి అయినా మనిషి వెనుకాడటం లేదు. అయితే ఈ అభివృద్ధి అనే ముసుగులో చేస్తున్న విధ్వంసం వల్ల మనిషి తన జీవితాన్ని.. జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసుకుంటున్నాడు.. ఫలితంగా అనేక రోగాలు వ్యాధులు, మందులకు లొంగని జబ్బుల బారిన పడుతున్నాడు. ఈ రోగాల వల్ల, జబ్బుల వల్ల మనుషులు పెక్కు సంఖ్యలో చనిపోతున్నారు. అయినప్పటికీ అభివృద్ధి అనే విధ్వంసాన్ని మనిషి ఆపడం లేదు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు గాని.. ఇప్పటికైతే రోగాలు, జబ్బులు మనిషిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
ఫారెస్ట్ బాతింగ్
రోజురోజుకు మనుషుల్లో రోగాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. మందులు, ఇతర ఇంజక్షన్లు వేయడం వల్ల శరీరం ఇంకా కుంగిపోతోంది. ఇలాంటి సమయంలో జపాన్ వైద్యులు సరికొత్త వైద్య విధానానికి తెర లేపారు. వైద్య విధానంలో ఇంతవరకు లేనటువంటి ఫారెస్ట్ బాతింగ్ అనే ప్రక్రియకు తెర లేపారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని..జపాన్ వైద్యులు చెప్తున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడితే రోగనిరోధక శక్తి దానంతట అదే మెరుగుపడుతుందని.. తద్వారా రోగాలు, జబ్బులు తగ్గుతాయని జపాన్ వైద్యులు చెబుతున్నారు.. ఇటీవల కాలంలో ఈ తరహా వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి జపాన్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది.. ఫారెస్ట్ బాతింగ్ వల్ల సహజసిద్దంగా ఇమ్యూనిటీ ఏర్పడటం వల్ల.. జబ్బులు, రోగాల నివారణకు మందులు వాడాల్సిన అవసరం ఉండదని.. ఫలితంగా మనిషి ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు.. అయితే ఇదే విధానాన్ని మరింత మెరుగ్గా అమలు చేయడానికి జపాన్ వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు..” ప్రకృతి అనేది అనేక అద్భుతాల పుట్ట. అందువల్లే మనుషులకు సహజ సిద్ధంగా ఇమ్యూనిటీ వస్తుంది. ప్రకృతిలో గడపడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధానం మనుషులకు ఎంతగానో ఉపకరిస్తుందని” జపాన్ వైద్యులు చెబుతున్నారు. జపాన్ లో అడవులు భారీగానే ఉంటాయి. అక్కడ అరుదైన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి.. కాలుష్యం స్థాయి తక్కువ కాబట్టి అక్కడ ప్రకృతి వనరుల మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందువల్ల సహజ సిద్ధంగా ప్రజలకు ఇమ్యూనిటీ ఏర్పడుతోంది. ఫారెస్ట్ బాతింగ్ వల్ల ఉపయోగం కలుగుతోంది. జపాన్ లో సాంప్రదాయ వైద్య విధానాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆయుర్వేద విధానం అక్కడ ఎక్కువగా అమల్లో ఉంటుంది. సంప్రదాయ వంటకాలను ఆరగించడాన్ని అక్కడి ప్రజలు ఎక్కువగా ఆచరిస్తుంటారు. అందువల్లే జపాన్లో ఫారెస్ట్ బాతింగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.