Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై అప్పుడే 6 వారాలు పూర్తి చేసుకొని 7వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ ప్రారంభమయ్యాక చప్పగా సాగింది. ముందు సీజన్స్ తో పోలిస్తే నత్తనడకన సాగినప్పటికీ,మూడవ వారం నుండి కాస్త పుంజుకొని ఎంటర్టైన్మెంట్ టాస్కులతో కాస్త గాడిలో పడింది..అయితే ఈ వారం ఇచ్చిన బిగ్ బాస్ టాస్క్ ని సరిగా ఆడకపోవడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు.

ఇప్పటి వరకు 5 సీజన్స్ ని పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఏ సీజన్ లో కూడా ఈ స్థాయిలో హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యినట్టు దాఖలాలు లేవు.. ఆ ఘనత సీజన్ 6 ఇంటి సభ్యులకే దక్కింది.. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులందరికి ఒక్కో సినిమా క్యారక్టర్ ఇస్తూ జనాలను ఎంటర్టైన్ చెయ్యమంటాడు..కానీ కంటెస్టెంట్స్ అందరూ తమ గెటప్స్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కు మీద పెట్టలేకపొయారు.
ఎవరికీ వారు సోది కబుర్లు చెప్పుకుంటూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుని పక్కకి నెట్టేశారు.. ఇది చూసి మండిపోయిన బిగ్ బాస్, హౌస్ మేట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి రమ్మని ఆదేశిస్తాడు..వెంటనే హౌస్ మెయిన్ డోర్ ని తెరిచి ‘మీకు ఆట మీద శ్రద్ద లేకపోతే మొహమాటం లేకుండా ఇంటి నుండి దొబ్బేయండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు..ఎవరికివారు కబుర్లు చెప్పుకునేందుకు మీకు బిగ్ బాస్ వేదిక కాదు..దానికి బయట చాలా వేదికలు ఉన్నాయి..అక్కడ చెప్పుకోండి మీ కబుర్లు అంటూ హౌస్ మేట్స్ పై విరుచుకుపడ్డాడు బిగ్ బాస్.
దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు.. బిగ్ బాస్ కి ఈ రేంజ్ కోపం తెప్పించారంటే,ఇక ఈ వీకెండ్ లో నాగార్జున గారి చేతిలో హౌస్ మేట్స్ అందరికి మూడింది అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు నెటిజెన్స్..మరి ఈరోజు హౌస్ మేట్స్ ప్రవర్తించిన తీరుపై నాగార్జున రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.