Valentine Day 2023: ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 8 ప్రపోజ్ చేసే రోజు. ఇలా ప్రేమికులకు ఫిబ్రవరిలో అన్ని ఇష్టమైన రోజులే. ప్రేమికులు తమ ఊహల్లో విహరిస్తారు. ఊసులు పంచుకుంటారు. బాసలు చేసుకుంటారు. భవిష్యత్ పై కలలు కంటారు. తనకు కాబోయే జీవిత భాగస్వామి గురించి ఎన్నో ఆశలతో ఉంటారు. ప్రేమలేని మనిషుండడు. ప్రేమించలేని మనసు ఉండదు. జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడాల్సిందే. ప్రేమలో విహరించాల్సిందే. విరహంతో రగిలిపోవాల్సిందే. పుట్టిన ప్రతి మనిషి ప్రేమించబడతాడు. ప్రేమిస్తాడు. ప్రేమనే అందమైన భావన కలగని వారుండరంటే అతిశయోక్తి కాదు.

ప్రేమను వ్యక్తం చేయడానికి పలు మార్గాలు
ప్రేమను వ్యక్తం చేయడంలో విభిన్న రీతులు ఉంటాయి. కొందరు ప్రేమలేఖ రాస్తారు. ఇంకా కొందరు మాటల ద్వారా చెబుతారు. మరికొందరు కవితల ద్వారా వ్యక్తం చేస్తారు. ఇలా ప్రేమలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దీంతో ప్రేమను వ్యక్తం చేయడంలోనే మన ప్రేమ ఘాటు దాగుంటుంది. ప్రతి మనిషి ప్రేమించాలి. ప్రేమించబడాలి. అప్పుడే జీవితం మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రేమ మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. ప్రేమను వ్యక్తం చేయడం కూడా ఓ కళ.
సందేశాల రూపంలో..
ప్రమను ప్రపోజ్ చేయడానికి ఫీల్ అవుతారు. ఎదురుగా ఉన్నప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడేవారు సందేశాల రూపంలో పంపుతారు. మనం వ్యక్తం చేసే భావాలను ముందే టైపు చేసుకుని తరువాత సెండ్ కొట్టాలి. అంతేకాని అందులో తప్పులున్నాయి మళ్లీ కొడతానంటే కుదరదు. ఒకసారి వారికి వెళితే ఇక వారి సమాధానం కోసం వేచి చూడాలి. అంతేకాని సందేశం తిరిగి రావడం లేదని మళ్లీ పంపడం సమంజసం కాదు. మెసేజ్ రూపంలో ప్రేమను వ్యక్తం చేయడం మంచిదే.
బొమ్మల ద్వారా..
మీరు ఆర్టిస్టు అయితే బొమ్మల ద్వారా తెలియజేయొచ్చు. ఆమె ముఖం బొమ్మగా వేసి ఐ లవ్ యూ అని పెట్టండి. దీంతో ఆమె థ్రిల్ గా ఫీలయితే మీ లవ్ ను ఓకే చేస్తుంది. లేదంటే రిప్లై ఇవ్వదు. డ్రాయింగ్ ఇస్తూ ఓ అందమైన రొమాంటిక్ పాట పాడండి. దీంతో ఆమె మీ ప్రపోజల్ కు ఫిదా అవడం గ్యారంటీ. ఆమె తిండిని బాగా ఇష్టపడితే ఆమెకు ఇష్టమైన వంటకం గురించి తెలుసుకుని ఆమెను సర్ ప్రైజ్ చేస్తూ ఓ అందమైన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ తినేటప్పుడు ప్రపోజ్ చేయండి. కచ్చితంగా సరే అంటుంది.

పజిల్ వేసి కూడా..
మీకు పజిల్ అంటే ఇష్టమైతే ఆమె కోసం ఓ లవ్ పజిల్ పెట్టండి. అందులోనే ఐలవ్ యూ అనే లక్షరాలు వచ్చేలా ప్లాన్ చేయండి. దీంతో ఆమె ఇంకా ఎంజాయ్ చేస్తుంది. గేమ్ ను సింపిల్ గా క్రియేట్ చేసి పరిష్కరించేలా మీరే హింట్ ఇవ్వొచ్చు. ఇలా చేస్తే కూడా ఎంతో వైవిధ్యంగా ఫీలవుతారు. కాఫీ తాగుతూ కూడా ప్రపోజ్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు కాఫీ ఆర్డర్ చేసి దానిపై ఐలవ్ యూ అని రాయండి. దీంతో ఆమె సంతోషిస్తుంది. వెంటనే మీ లవ్ ను ఒప్పుకుంటుంది. ఇలా ప్రేమను వ్యక్తం చేయడంలో విభిన్న మార్గాలు ఉన్నాయి. వాటిని పాటించి మీ ప్రేమను స్వచ్ఛమైనదిగా నిరూపించుకోండి.