Old Movies: గతంలో సినిమాలు తీయడంలో సిద్ధహస్తులు ఉండేవారు. వారి దర్శకత్వ ప్రతభ ఎంతో గొప్పది. చాలా సినిమాల్లో అప్పట్లో గ్రాఫిక్స్ లేకపోయినా కథనంలో అలాంటి అనుభూతి కల్పించేవారు. దీంతో సినిమాలంటే అప్పట్లోనే క్రేజీ ఉండేది. ఇప్పుడు కథల్లో వైవిధ్యం కరువు. నాలుగు పాటలు మూడు ఫైట్లతో సినిమా ముగించేస్తున్నారు. కానీ అప్పుడు ఇలా కాదు. సినిమా కథనంలో మనం తలమునకలై పోయేవారం. వైవిధ్యభరితమైన సన్నివేశాలు కథలో కీలక మలుపులు, కథ ఎటు పోతోందోననే ఊహించడమే కష్టంగా ఉండేది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు సినిమాలపై మోజు తగ్గుతోంది. ప్రతి రోజు టీవీల్లో చూసే సినిమాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి సినిమా విషయంలో మనకు ఎన్నో అంచనాలు ఉండేవి.

విఠలాచార్య విద్యలు
దర్శకుడు విఠలాచార్య సినిమాల్లో అచ్చం ఇప్పటి గ్రాఫిక్స్ ను పోలిన సన్నివేశాలు ఉండేవి. సహజంగా మేఘాల్లో తేలినట్లు అనిపించే విధంగా పలు సన్నివేశాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. దీంతో అప్పటి సినిమాల్లో గ్రాఫిక్స్ లేకపోయినా అచ్చం అలాంటి అనుభూతి కలిగించే సన్నివేశాలు చూసి మురిసిపోయేవారు ప్రేక్షకులు. ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయినా అప్పటి ఊపు రావడం లేదు. ఫలితంగా మనకు కళ్లకు కట్టినట్లు సన్నివేశాలు కనిపించేవి. నర్సింహరాజు, జ్యోతిలక్ష్మి నటించిన జగన్మోహిని సినిమాలో ఎన్నో సన్నివేశాల్లో మనకు అబ్బురపరచే సన్నివేశాలు కనిపిస్తాయి. ఇలా విఠలాచార్య తన ప్రతిభతో చిత్రాన్ని వైవిధ్యభరితంగా తీసి ఔరా అనిపించుకునే వారు.
ఇప్పటి దర్శకుల్లో..
ప్రస్తుతం తీసే సినిమాల్లో మసాలా ఉండటం లేదు. కథలో కొత్తదనం కనిపించడం లేదు. ఏదో తీశామంటే తీశామనే ఉద్దేశంలోనే ఉన్నారు కానీ వైవిధ్యంగా సిసిమాల తీయడం లేదు. ఫలితంగా ఎంతో మంది ప్రతిభ ఉన్న వారు తెర మీదకు రావడం లేదు. కక్క ముక్కలు తిన్న వారు మాత్రమే పరిశ్రమలో ఉంటున్నారు. మంచివారికి అవకాశాలే రావడం లేదు. ఈ క్రమంలో మంచి సినిమాలు మచ్చుకైనా కానరావడం లేదు. కుటుంబ కథలతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు.
కోట్లు పెట్టినా..
ప్రస్తుతం తీసే సినిమాల్లో గ్రాఫిక్స్ కోసం రూ. కోట్లు కేటాయిస్తున్నా ఫలితాలు మాత్రం అంతంత మాత్రమే. దీంతో సినిమాల నిర్మాణంలో వందల కోట్లు ఖర్చు చేసినా గ్యారంటీ ఇవ్వడం లేదు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. దర్శకుడు చేసిన వారు ఫలితం అనుభవిస్తున్నారు. అందుకే సినిమా నిర్మాణమంటే ఆషామాషీ కాదు. అందరు దర్శకులు కారు. సహజసిద్ధమైన భావ వ్యక్తీకరణతోనే నటులు రాణిస్తారు. కానీ ఇప్పటి వారిలో అంతటి ప్రావీణ్యం కనిపించడం లేదు. ఏదో తీసినట్లుగా తీసి పారేస్తున్నారు.

నిర్మాతకే బొక్క
ఎంత ఖర్చు చేసినా పెట్టిన ప్రతి రూపాయి రాకపోతే నిర్మాతకు ఇబ్బందులే. కోట్లకు కోట్లు అప్పుగా తెచ్చి పెట్టినా కథలో బలం లేకపోతే అంతే. ఇప్పుడు ట్విస్ట్లులు లేని సినిమాలు చూడటం లేదు. కామెడీలు ఎక్కువగా పండటం లేదు. వినోదమే కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా తీస్తున్నారు. కానీ కొత్తదనం చూపించడం లేదు. సినిమా అంతా బోరింగ్ గానే నడుస్తోంది. అప్పటి వారి టాలెంట్ తో కోట్లు పెట్టకపోయినా గ్రాఫిక్స్ ను తలదన్నే విధంగా తీసేవారు. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా జనరంజకంగా సినిమాలు తీసే సత్తా కనిపించడం లేదు.