Writer Padmabhushan: ప్రముఖ నటుడు సుహాస్ హీరో గా నటించిన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఫన్ మరియు ఎమోషన్స్ తో డైరెక్టర్ షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాని ఎంతో చక్కగా తీసాడు..అందుకే చిన్న సినిమా అయ్యినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది..కేవలం మూడు కోట్ల 80 లక్షల రూపాయలతో తీసిన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటి లాభాల్లోకి అడుగుపెట్టింది.

ఏడాది ప్రారంభం లో ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి విజయాలను అందుకొని మంచి జోష్ మీద ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ విజయపరంపర ని కొనసాగిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాకి టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని చూసి మూవీ టీం ని మెచ్చుకున్నాడు.
రోజు రోజుకి ఈ సినిమాకి వస్తున్నా ఆదరణ ని చూసి మూవీ యూనిట్ ప్రేక్షకుల కోసం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.అదేమిటి అంటే ఈ చిత్రం బుధవారం రోజు అనగా రేపు ఆడవాళ్ళకి 30 సెలెక్టివ్ థియేటర్స్ లో ఉచితంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారట.ఈ విషయాన్నీ స్వయంగా మూవీ యూనిట్ అధికారికంగా తెలిపింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి పాన్ చెయ్యలేదు.

మహా అయితే టికెట్ రేట్స్ తగ్గించేవాళ్ళు అంతే.కానీ ఇక్కడ ఏకంగా లేడీస్ కి ఉచిత టికెట్స్ అంటున్నారంటే మూవీ టీం కి ఆడవాళ్లు అంటే ఎంత గౌరవం అనేది అర్థం అవుతుంది..ఒక సినిమా లాంగ్ రన్ బలంగా రావాలంటే ఆడవాళ్లు థియేటర్స్ కి కదిలితేనే అని ట్రేడ్ విశ్లేషకులు సైతం అంటూ ఉంటారు..వాళ్లకి మరింత రీచ్ అవ్వడానికి ఈ మార్గం ని ఎంచుకొని ఉండొచ్చని కూడా అంటున్నారు విశ్లేషకులు.