FASTag KYC Update: టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ను తగ్గించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వాహనదారులు తమ ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను జనవరి 31లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే ఆ తర్వాత సదరు ఫాస్టాగ్ ఖాతాలు బ్లాక్ అవుతాయని పేర్కొంది. ఫాస్టాగ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఖాతాను బ్లాక్ చేస్తామని ప్రకటించింది. బుధవారంతో ఈ గడువు ముగియనుంది. ఇప్పటికీ కేవైసీ అప్‌డేట్ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి.ఫాస్టాక్ కేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలో చూద్దాం.
అప్‌డేట్ ఇలా..
– బ్యాంకు లింక్ చేయబడిన ఫాస్టాగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
– మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
– మై ప్రొఫైల్ ఆప్షన్‌కు వెళ్లి కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయాలి.
– అడ్రస్ ప్రూఫ్ వంటి అవసరమైన వివరాలు నమోదు చేయాలి. తర్వాత సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయండి.
– ఈ విధంగా కేవైసీ పూర్తవుతుంది. ఆ తర్వాత కేవైసీ పేజీ మీ కేవైసీ స్టేటస్‌ను చూపుతుంది.
ఇలా చెక్ చేసుకోవాలి…
– మీరు జ్చట్ట్చజ.జీజిఝఛి .ఛిౌఝ వెబ్‌సైట్ సందర్శించి ఫాస్టాగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
– వెబ్ పేజీ ఓపెన్ కాగానే కుడివైపు ఎగువన ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
– లాగిన్ చేయడానికి మళ్లీ ఓటీపీ అడుగుతుంది. అక్కడ రిజిస్టర్ మొబైన్ నంబర్ ఎంటర్ చేయాలి.
– లాగిన్ అయిన తర్వాత డ్యాష్‌బోర్డులోని మై ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
– మై ప్రొఫైల్ సెక్షన్‌లో మీరు ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్, రిజిస్ట్రేషన్ ప్రికయ సమయంలో సమర్పించిన ప్రొఫైల్ వివరాలు కనిపిస్తాయి.
కావాల్సిన పత్రాలు..
కేవైసీ అప్‌డేట్ కోసం ఈ పత్రాలు తప్పనిసరి.
– వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
– గుర్తింపు కార్డు
– అడ్రస్ ప్రూఫ్
– పాస్‌పోర్టు సైజు ఫొటో
– ముఖ్యంగా ఐడీ, చిరునామా కోసం పాస్‌పోర్టు, ఓటరు ఐడీ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు వీటిలో ఏదైనా సరిపోతుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Fastag kyc update today is the last day for fastag kyc update
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com