Veera Simha Reddy: పుట్టుకతో వచ్చిన బుద్ది పుల్లలతో కానీ పోదంటారు. ఎంత అమెరికాలో ఉంటున్నా తెలుగోళ్ళ అలవాట్లు ఎందుకు మారతాయి. డీసెన్సీకి మారుపేరైన అమెరికన్ సొసైటీలో ఉంటూ కల్చర్ లెస్ బిహేవియర్ తో ఆంధ్రావాళ్లు వార్తలకెక్కుతున్నారు. ఫ్యాన్ వార్ పేరుతో ఇటీవల పవన్ కళ్యాణ్-బాలకృష్ణ ఫ్యాన్స్ చికాగోలో కొట్టుకున్నారు. అది పెద్ద న్యూస్ అయ్యింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు మరో న్యూసెన్స్ చేశారు. వీరసింహారెడ్డి థియేటర్లో అభిమానుల అల్లరి హద్దులు దాటిపోగా యాజమాన్యం బయటకు పంపేసింది.

జనవరి 12న వీరసింహారెడ్డి వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల చేశారు. యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. కాగా ఓ థియేటర్లో పేపర్స్ విసురుతూ బాలయ్య ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. కాసేపు ఉపేక్షించిన యాజమాన్యం మరింతగా రెచ్చిపోతుంటే… మూవీ ప్రదర్శన ఆపేశారు. అందరూ థియేటర్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. గతంలో చాలా తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు ఈ థియేటర్లో ప్రదర్శించారు. ఇంత అల్లరి ఎవరూ చేయలేదు. మూవీ ప్రదర్శించేది లేదు. వెంటనే బయటకు వెళ్లిపోండని గట్టిగా చెప్పారు.
చేసేది లేక బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ థియేటర్ ని వీడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అభిమానం పేరుతో చేసే ఇలాంటి చర్యలు ఆంధ్రాలో మాత్రమే చెల్లుతాయి. అమెరికాలో కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్టార్ హీరోల అభిమానులు థియేటర్స్ ధ్వంసం చేశారు. లక్షల్లో యాజమాన్యాలకు నష్టం చేకూర్చారు.

హీరో మీద అభిమానులు చూపించే ప్రేమ ఆయన గౌరవం పెంచేదిగా ఉండాలి. ఇలా దిగజార్చేదిగా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక వీరసింహారెడ్డి మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్, బాలకృష్ణ డైలాగ్స్ మినహాయించి సినిమాలో చెప్పుకోదగ్గ విషయం లేదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అవుట్ డేటెడ్ కథ, కథనాలు సినిమా ఫలితం దెబ్బతీశాయి అంటున్నారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలున్న నేపథ్యంలో వీరసింహారెడ్డి విజయం సాధిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
It’s high time that telugu movie goers in overseas has to refrain from these activities. There is no issue in engaging and enjoying, but causing nuisance is unwarranted#VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaReddy #TeluguCinema #VSR #BalakrishnaNandamuri #NBK #NandamuriBalakrishna pic.twitter.com/yHTiBRYaJq
— TeluguBulletin.com (@TeluguBulletin) January 12, 2023