Kalai Ruti: నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమూ ప్రధానమే అయింది. ముఖ్యంగా బరువుపెరిగే వారు సన్నబడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారంలో నాణ్యతా లోపాలు, జంక్ ఫుడ్ వల్ల చాలా మంది అధిక బరువు పెరుగుతున్నారు. ఈ బరువు తగ్గడానికి కొందరు వైద్యులు ఒకపూట అన్నంకు బదులు చపాతీలు తినాలని చెబుతున్నారు. చపాతీలు అనగానే కొందరు ఇష్టంగా తింటారు. మరికొందరు అవైడ్ చేస్తారు. సాధారణంగా చపాతీలు గోధుమ పిండితో తయారు చేస్తారు. వీటికి కర్రీ యాడ్ అయితే ఎంతో రుచిగా ఉంటాయి. కానీ పశ్చిమ బెంగాల్ లో తయారు చేసే ఈ రోటీ ప్రత్యేకంగా నిలుస్తోంది. కలై రోటీగా పిలవబడే దీని విశేషాలేంటో తెలుసుకుందాం..
పశ్చిమ బెంగాల్ లోని మాల్దా ప్రాంతాల్లో ఎక్కువ మంది సాధారణ ఆహారం కంటే ఎక్కువగా కలై రోటీని తీసుకుంటూ ఉంటారు. కలై రోటీ తయారి ప్రత్యేకంగా ఉంటుంది. నేచురల్ గా దీనిని తయారు చేస్తారు. దీంతో రుచికరంగా ఉండడడంతో పాటు ఎలాంటి ఆయిల్ లేని ఫుడ్ ను తీసుకున్నవాళ్లవుతారు. అంతేకాకుండా సాధారణ రోటీ కాంటే ఇది కాస్త మందంగా ఉండడంతో తక్కువ పరిమాణంలో తీసుకున్నా కడుపునిండినట్లయి అధిక కొలెస్ట్రాల్ ను దరిచేరనివ్వదు.
మాల్దా నగరంలో స్టార్ హోటళ్లకు తీసిపోని విధంగా కొన్ని చిన్న హోటళ్లలో ఎక్కువగా ఇటుక పొయ్యిలు కనిపిస్తాయి. వీటిల్లో ఎక్కువగా కలై రోటీని తయారు చేస్తుంటారు. కలైరోటీ తయారీలో బియ్యాన్ని కలై పిండిని కలుపుతారు. ఈ మిశ్రమంను రోట్టెలాగా తయారుచేసిన నేరుగా ఇటుక పొయ్యలపై కాలుస్తారు. దీనికి ఎలాంటి ఆయిల్ రాయకుండా ఉండడంతో ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ముఖ్యంగా చలికాలంలో వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మల్దా నగరంలోని ఒక్కో చపాతీకి రూ. 20లతో విక్రయిస్తు్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఈ రొట్టెలను తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఏడాది పొడవునా వీటి విక్రయాలు సాగినా.. చలికాలంలో మాత్రం ఎక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు.