Bob Saget: కొన్ని మరణాలు చాలా బాధాకరంగా ఉంటాయి. పైగా అందరినీ నవ్విస్తూ ఉండే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో శవంగా పడి ఉంటే జీర్ణించుకోవడం చాలా కష్టం. అమెరికా ప్రముఖ హాస్య నటుడు బాబ్ సాగేట్ చనిపోయాడు. అయితే, ఆయన మరణం పై ఇప్పుడు అందరికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సడెన్ గా బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో ఎందుకు మృతి చెందాడు ? ఇదే ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
ఇంతకీ అసలు ఏమి జరిగింది అంటే.. బాబ్ సాగేట్ ఫ్లోరిడాలోని ఒక హోటల్ గదిని తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆయన చాలా సరదాగా సంతోషంగా ఉన్నాడు. ఉదయం హోటల్ సిబ్బంది వెళ్లి తలుపు తట్టగానే ఆయన శవమయ్యి కనిపించాడు. బాబ్ సాగేట్ వయసు ప్రస్తుతం 65 ఏళ్లు. అయినా బాబ్ సాగేట్ కి పెద్దగా ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు కూడా లేవు. మరి ఆయన ఎలా చనిపోయాడు ?
అసలు ఆ రాత్రి ఏమి జరిగి ఉంటుంది ? ప్రస్తుతం విచారణ జరుగుతుంది కాబట్టి.. అసలు నిజానిజాలు త్వరగానే తెలుస్తాయని ఆశిద్దాం. ఏది ఏమైనా ఎంతో మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ఆ గొప్ప కమెడియన్ ఇలా అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకు విశేష అభిమానులు ఉన్నారు. అందుకే ఈ వార్త హాలీవుడ్ ను బాగా కలచి వేసింది.
Also Read: అమెరికాలో ఆరని అగ్ని జ్వాలలు
స్టాండ్ కామెడీతో పాటు టెలివిజన్ షోలకు కూడా ఆయన గతంలో హోస్ట్ చేసి అలరించారు. మెయిన్ గా 2016లో ‘ఫుల్లర్ హౌస్’ పేరుతో నెట్ ఫ్లిక్స్‌లో ప్రారంభమైన షోతో ఆయన బాగా పాపులర్ అయ్యాడు. కానీ ఇలా సడెన్ గా చనిపోవడం తో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ లో ఉన్నారు. అయితే, ఆయనకు ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయని బాబ్ సాగేట్ సన్నిహితులు చెబుతున్నారు.
కాబట్టి.. ఆయన చావుకు ఫ్యామిలీ గొడవలు ఏమైనా కారణమా ? చూడాలి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున బాబ్ సాగేట్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: జనవరి 10 : చరిత్రలో ఈ రోజు ప్రత్యేకతలు !