https://oktelugu.com/

America: అమెరికాలో ఆరని అగ్ని జ్వాలలు

America: అమెరికాలో కార్చిచ్చు రేగుతోంది. ఇప్పటికే కాలిఫోర్నియాలో దావానంలా వ్యాపించిన మంటలతో అడవులు దహించుకుపోయాయి. ఇప్పుడు నగరాల్లో సైతం అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భారీ నష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని బ్రాంక్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదంతో 9 మంది చిన్నారులతో పాటు 19 మంది చనిపోవడం సంచలనం సృష్టించింది. కనీస ప్రమాణాలు పాటించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో చాలా మంది […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2022 / 12:46 PM IST
    Follow us on

    America: అమెరికాలో కార్చిచ్చు రేగుతోంది. ఇప్పటికే కాలిఫోర్నియాలో దావానంలా వ్యాపించిన మంటలతో అడవులు దహించుకుపోయాయి. ఇప్పుడు నగరాల్లో సైతం అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భారీ నష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని బ్రాంక్స్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదంతో 9 మంది చిన్నారులతో పాటు 19 మంది చనిపోవడం సంచలనం సృష్టించింది. కనీస ప్రమాణాలు పాటించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.

    America

    అగ్ని ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారందరికి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ న్యూయార్క్ కమిషనర్ డేనియల్ నీగ్రో వెల్లడించారు. దాదాపు 63 మంది గాయపడినట్లు తెలుస్తోంది. రెండు, మూడో అంతస్తుల్లో ఉదయం 11 గంటలకు మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. న్యూయార్క్ లో సంభవించిన అగ్ని ప్రమాదాల్లో ఇది కూడా నష్టాన్ని మిగిల్చిందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: భారత సైన్యానికి సరికొత్త యూనిఫామ్.. శ‌త్రువుల గుండెల్లో ద‌డ పుట్టేలా..

    నగరంలో అగ్ని ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రమాదం చోటుచేసుకోవడంతో నష్టం భారీగానే మిగిలింది. దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఇంత పెద్ద అంతస్తుల్లో కనీస ప్రమాణాలు ఏవీ పాటించడం లేదని తెలుస్తోంది. అందుకే ఇంత భారీ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

    అమెరికాలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. జనంతోపాటు ఆస్థి కూడా నష్టపోతోంది. దీంతో దేశంలో అగ్ని ప్రమాదాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    Also Read: అసలు కరోనా వచ్చిందో లేదో ఎలా గుర్తించాలంటే? జాగ్రత్తలివీ!

    Tags