Semiconductor Industry : లక్షన్నర కోట్ల పెట్టుబడితో అహ్మదాబాద్ లో ఒక సెమీ కండక్టర్ పరిశ్రమ పెడుతున్నారు. ఇంత పెద్ద పరిశ్రమ భారతదేశంలో వస్తోంది. ఇప్పుడు దీనిపై చైనా గుత్తాధిపత్యం ఉంది. చైనాలోనే వీటిని తయారు చేస్తారు.కానీ కరోనాతో చైనా ఉత్పత్తి తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా చిప్ ల కొరత ఏర్పడింది.
దీంతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సెమీ కండక్టర్ ల విషయంలో ఇతర దేశాలపై ఆధారపడవద్దని.. దేశంలో సరికొత్తగా తయారు చేయాలని బిల్ పెట్టడం.. అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిపోయింది.
కరోనా మహమ్మారి కారణంగా ఆ ఏడాది వాహన అమ్మకాలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం ప్రధానంగా సెమీకండక్టర్స్ అండ్ చిప్స్ కొరత అని తెలిసింది. మార్కెట్లో వాహనాలకు డిమాండ్ ఉన్నా అనుకున్నంత సరఫరా జరగలేదు. ఫలితంగా దసరా, దీపావళి టైంలో కేవలం 20,90,893 కార్లను పలు కంపెనీలు విక్రయించాయి. 2020లో సరిగ్గా ఇదే సీజన్‌లో 25,56,335 కార్లు డీలర్లు విక్రయించారు. మొత్తంగా ఈ ఏడాది 26 శాతం ప్యాసింజర్స్ వాహనాలు, 18శాతం టూవీలర్స్ అమ్మకాలు తగ్గాయి.
చిప్ ల తయారీలో ఏం వాడుతారు? సెమీ కండక్టర్ ల వల్ల ఉపయోగాలు ఏమిటీ? వీటిని ఎందులో వాడుతారు? అన్న దానిపై సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.